కూలిన ఇళ్ళ్ళు.. తప్పిన ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బోప్పాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ బియాశా, ఖలీద్ ల కుటుంబం నివసిస్తున్న ఇళ్ళ్లు వరుసగా కురిసిన వర్షాలకు కూలిపోయింది.

అదే గదిలో ప్రతి రోజూ నిద్రించే ఖలీద్ ఆయన భార్య , కూతురు , కుమారుడు గత రాత్రి మరో గదిలో నిద్రించారు.

దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది.ఉదయం ఒక్క సారిగా ఇంటి పై కప్పు కూలిపోవడంతో భయం, భయం గా అందులోని సామాగ్రిని బయటకు తీసుకు వచ్చారు.

ఖలీద్ కుటుంబసభ్యులు కూలిన గదిలో నిద్రించేవారని,వారి తల్లి బియాశ మరోగదిలో నిద్రించేదని కుటుంబసభ్యులు తెలిపారు.వర్షాల కారణంగా ఇల్లుకూలిన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు, కుటుంబసభ్యులు కోరారు.

రాజన్న ఆలయ 26 రోజుల హుండీ ఆదాయం
Advertisement

Latest Rajanna Sircilla News