ఆ ఊరిలో మంచులా కురిసిన ‘చాక్లెట్’.. జనం ఏం చేశారంటే?

ఏంటి నిజామా? నిజంగా చాక్లేట్ కురిసిందా ? అని ఆశ్చర్యం వేస్తుంది కదా! అవును.స్విట్జర్లాండ్‌లో ఉన్నట్టుండి చాక్లేట్ మంచులా కురిసింది.

ఆ చాక్లేట్ ను చూసి అక్కడ స్విస్ పట్టణవాసులు కూడా ఆశ్చర్యపోయారు.ఇదేంటి ఇలా కురుస్తుంది అని.కానీ వారికి ఆతర్వాత అర్థం అయ్యింది ఆ చాక్లేట్ మంచు ఎక్కడ నుంచి కురుస్తుంది అనేది.ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో వెంటిలేషన్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో చాక్లేట్ మంచు కురవడం మొదలైందట.

జూరిచ్, బాసెల్ మధ్య ఓల్టెన్‌లోని తమ కర్మాగారంలో కాల్చిన ‘కోకో నిబ్స్’ శీతలీకరణ వెంటిలేషన్‌లో సమస్య వచ్చిందని లిండ్ట్ అండ్‌ స్ప్రూయంగ్లీ సంస్థ కూడా ద్రువీకరించినట్టు కోకో పౌడర్ బలమైన గాలితో కలిసి సమీప ప్రాంతాల్లో మంచులా కురిసింది అని తెలిపారు.కాగా ఈ కోకో పౌడర్ గాలికి వచ్చి ఒక కారుపై పడిందని.

దీని వల్ల ఆ కారు పాడైందని దాన్ని వారే బాగు చేయించనున్నట్టు ఆ సంస్ద యజమాని తెలిపారు.అంతేకాదు ఈ కోకో కణాలు ప్రజలకు కానీ, పర్యావరణానికి కానీ ఎలాంటి ప్రమాదం కాదు అని వెల్లడించారు.

Advertisement

వెంటిలేషన్ వ్యవస్దకు మరమత్తులు చేయించినట్టు తెలిపారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు