జీమెయిల్ సర్వర్ కు ఏమైంది...? సమస్యలు ఎదుర్కొంటున్న యూజర్లు..!

ప్రపంచవ్యాప్తంగా అధికశాతం డిజిటల్ రంగం పనులలో ఉపయోగించుకోవడానికి జీమెయిల్ చాలామంది ఉపయోగిస్తారు.

ఆఫీస్ కు సంబంధించిన వివరాలు కానీ, ఏదైనా పర్సనల్ విషయం అయినా కాని చాలామంది జిమెయిల్ ను ఉపయోగిస్తారు.

అయితే నేడు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కూడా జిమెయిల్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అనేక దేశాల్లో జీమెయిల్ కు సంబంధించిన సర్వర్ నేడు డౌన్ అయింది.

ఈ కారణంచేత అనేకమంది జీమెయిల్ యూజర్స్ వారి అకౌంట్ కు లాగిన్ అవ్వలేకపోతున్నారు.ఒకవేళ లాగిన్ అయినప్పటికీ వారు మెయిల్స్ పంపించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అంతేకాదు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేస్తున్న సమయంలో చెక్ చేసుకోండి అంటూ ఎర్రర్ మెసేజ్ వస్తుంది.అయితే ఈ సమస్య కేవలం భారతదేశంలోనే కాకుండా ఆస్ట్రేలియా, జపాన్, కెనడా లాంటి కొన్ని దేశాల్లో కూడా ఉత్పన్నమైంది.

Advertisement

ఇకపోతే ఈ సమస్య ఎదురైనట్లు డౌన్ డిటెక్టర్ కెనడా అనే సంస్థ తెలియజేసింది.కాకపోతే ఈ సంస్థ కేవలం జిమెయిల్ మాత్రమే కాకుండా గూగుల్ డ్రైవ్ కూడా పని చేయట్లేదని తెలియజేసింది.ఇందుకు సంబంధించి దిగ్గజ కంపెనీ గూగుల్ స్పందించింది.

తమ యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు మా దృష్టికి వచ్చిందని వాటికి వీలైనంత తక్కువ సమయంలో పరిష్కారం చూపుతామని గూగుల్ సమాధానం ఇచ్చింది.ఇలా ఈ విషయానికి సంబంధించిన సమస్యలు వైదొలిగిన తర్వాత మళ్లీ అప్డేట్ ఇస్తామని గూగుల్ సంస్థ తెలియజేసింది.

ఈ కారణంగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున నెటిజన్స్ భారీగా స్పందిస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు