హైకోర్టు వ్యాఖ్యలు కేసీఆర్ ను అంత బాధపెట్టాయా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పెద్ద చిక్కుముడిలా కనిపిస్తోంది.

దీనిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ దొరకకపోగా కార్మికులు, ప్రజలు, కోర్టు ముందు కూడా ప్రభుత్వం దోషిగా నిలబడాల్సి వస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట.

సమ్మె విషయంలో ఇప్పటికి సరైన పరిష్కార మార్గం దొరకలేదని ఇది ప్రభుత్వానికి రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికర పరిణామమని కేసీఆర్ భావిస్తున్నారట.తాజాగా ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు వ్యవహరిస్తున్న తీరుపై అధికారులతో సమీక్ష చేసినట్టు తెలుస్తోంది.

ఆర్టీసీపై హైకోర్టు కు నివేదికలు ఇచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు అని హైకోర్టు అంటోందని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం.ఈ విషయంలో ఐఏఎస్‌ అధికారులు కోర్టుకు హాజరై వివరణలు ఇస్తున్నా కోర్టు మాత్రం సంతృప్తి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట.

పైగా ఆర్టీసీకి చట్టబద్ధత లేదనడం విస్మయం కలిగిస్తోందని, చట్టబద్ధత లేకపోతే ఇన్ని రోజులుగా సంస్థ ఏ విధంగా నడుస్తోందని కేసీఆర్ అధికారులతో అన్నారట.కార్మికులు కూడా ఈ విషయంలో రాజీపడడంలేదని, ఇప్పటికే ఐఏఎ్‌సల కమిటీ వేసి చర్చలు జరిపాం.

Advertisement

ఈడీల కమిటీ వేసి కోర్టు సూచించిన 21 డిమాండ్లపై చర్చిస్తామని చెప్పమని అయినా వారు ఆ చర్చలను కాదని వెళ్లిపోయారు.ఇక మనం మాత్రం ఏం చేస్తాం, మా చేతుల్లో ఏమీ లేదని కోర్టు కే చెబుదాం అంటూ కేసీఆర్ అధికారులతో చెప్పారట.

మొత్తంగా చూస్తే ఆర్టీసీ విషయంలో కేసీఆర్ బాగా విసిగిపోయినట్టు కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు