జనవరి 25 నుంచి క్యాడర్ సమావేశాలకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్..!!

2024 ఎన్నికలలో గెలుపే దిశగా వైసీపీ అధినేత సీఎం జగన్( YCP CM YS Jagan ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుని ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను పోటీ నుంచి తప్పిస్తున్నారు.స్థానిక నియోజకవర్గాల సామాజిక సమీకరణాలు ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.

ఈ క్రమంలో వైసీపీ ఇన్చార్జిల మార్పుల విషయంలో ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేయడం జరిగింది.మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 మంది పేర్లను ఖరారు చేయడం జరిగింది.

ఈ విషయం నడుస్తూ ఉండగానే మరొక పక్క ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.కాగా జనవరి 25వ తారీకు నుంచి నాలుగైదు జిల్లాలకు సంబంధించిన కేడర్ తో జగన్ ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించటానికి రెడీ అయ్యారట.

Advertisement

నాలుగు నుండి ఆరు జిల్లాలను కలిపి ఐదు రీజియన్లలో క్యాడర్ సమావేశాలు నిర్వహిస్తామని వైసీపీ పార్టీ( YCP Party Meetings ) పెద్దలు స్పష్టం చేయడం జరిగింది.ఈ క్రమంలో జనవరి 25న విశాఖపట్నం భీమిలిలో తొలి సమావేశం నిర్వహించనున్నారు.

మిగిలిన నాలుగు ప్రాంతాల తేదీలను త్వరలో ప్రకటిస్తామని వైసీపీ పెద్దలు స్పష్టం చేయడం జరిగింది.ఈ సమావేశాలలో వచ్చే ఎన్నికలలో ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనే విషయాలను జగన్ నేతలకు సూచించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సమావేశాల తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల మధ్యలోకి జగన్ రాబోతున్నట్లు సమాచారం.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 
Advertisement

తాజా వార్తలు