టాలీవుడ్ ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేశారా.. నిన్న నాగార్జున నేడు బన్నీ.. ఎక్కడ చెడింది?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్( Allu Arjun ) పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

ఏకంగా ఈయనని జైలుకు పంపించడం పట్ల సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా పూర్తిస్థాయిలో ఈ ఘటనను తప్పుపడుతున్నారు.

అయితే తెలంగాణ సర్కార్ టాలీవుడ్ ఇండస్ట్రీ టార్గెట్ చేసిందా అంటే అవుననే తెలుస్తుంది.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాలకు అదనపు బెనిఫిట్ షోలు అలాగే టికెట్లు రేట్లు కూడా పెంచుకోవచ్చని తెలియజేసింది.

కానీ మరోవైపు సినిమా సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేయడంతో ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీనీ టార్గెట్ చేశారని తెలుస్తుంది.

Revanth Reddy Targer Tollywood Industry Details, Revanth Reddy, Allu Arjun, Toll

హైడ్రా కూల్చి వేతలలో భాగంగా రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నాగార్జునకు( Nagarjuna ) చెందిన ఎన్ కన్వెన్షన్( N Convention ) సెంటర్ ని పూర్తిగా కూల్చివేశారు.ఈ కన్వెన్షన్ సెంటర్ అక్రమంగా చెరువును ఆక్రమించి నిర్మించారన్న ఉద్దేశంతో ఒక్కసారిగా ఈ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారు.దీంతో నాగార్జున కూడా ఏకంగా కోర్టుకు వెళ్లారు.

Advertisement
Revanth Reddy Targer Tollywood Industry Details, Revanth Reddy, Allu Arjun, Toll

ఇలా నాగార్జున విషయంలో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై ఒక్కసారిగా టాలీవుడ్ సెలబ్రిటీలు ఆశ్చర్యపోయారు.ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కి( Allu Arjun ) ఏమాత్రం ప్రమేయం లేకుండా జరిగిన ఘటనలో ఆయనని నిందితుడిని చేసి ఏకంగా జైలుకు పంపించారు.

Revanth Reddy Targer Tollywood Industry Details, Revanth Reddy, Allu Arjun, Toll

ఇలా అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావడంతో సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.అయితే ఈ విషయంపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.అల్లు అర్జున్ ని ఉద్దేశించి రేవంత్ మానవత్వంలేని మనిషి అని వర్ణించటం సంచలనమైపోయింది.

రేవంత్ లోని మంట అల్లుఅర్జున్ మీదేనా లేకపోతే ఇండస్ట్రీ మొత్తం మీదనా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇలా రేవంత్ రెడ్డి వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేయడం పట్ల ఈయన ఎందుకు ఇండస్ట్రీని టార్గెట్ చేశారు ఇండస్ట్రీ వారితో ఈయనకు ఎక్కడ చేరింది అనే చర్చ వెలుగులోకి వచ్చింది.

ఇక తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు సినిమా హీరోలకు ఎలాంటి బెనిఫిట్ షోలు ఇవ్వనని ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు