బీజేపీ.. బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలపై గాంధీభవన్( Gandhi Bhavan ) లో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరో 60 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి అని వ్యాఖ్యానించారు.లోక్ సభ ఎన్నికలకు మంచి ఫలితాలు వచ్చేలా అందరూ కృషి చేయాలని సూచించారు.

పార్టీ అధిష్టానం తెలంగాణకు పరిశీలకులను నియమించడం జరిగింది.హరీష్ చౌదరి ( Harish Chaudhary )చైర్మన్ గా కమిటీ పనులు చూసుకుంటున్నారు.

ఈ లోక్ సభ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక కమిటీ చూసుకుంటుంది.అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ( bjp ). బీఆర్ఎస్ ( BRS )పార్టీలపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.మోదీ దేశం పై వందల లక్షల కోట్లు అప్పుమోప్పారు.

మోదీ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోయారు.ఇదే సమయంలో జరగబోయే ఈ పార్లమెంట్ ఎన్నికల టైములో మరోసారి మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు అని ఆరోపించారు.

ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.అదేవిదంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది.

దేశానికి రాహుల్ లాంటి నాయకుడు ప్రధానిగా రావాలి.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 

ఆ పార్టీ నేతల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.ఉనికి చాటుకునేందుకు వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు.

Advertisement

గతంలో మోదీని కేసీఆర్ ప్రశ్నించిన దాఖలాలే లేవు.అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు