కేంద్రం మనీ రాష్ట్ర ప్రభుత్వాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ పగడ్బందీ ఆదేశాలు ఇవ్వడం అందరికీ తెలిసిందే.ఇందుకోసం ఇప్పటికే ప్రధాని మోడీ చాలాసార్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావడం కూడా జరిగింది.
ఈ క్రమంలో తొలి టీకా ఆరోగ్య సిబ్బంది కి ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం అందరికీ తెలిసిందే.దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే కరోనా తొలి టీకా విషయంలో కేసీఆర్ సర్కార్ సరికొత్త ఆలోచన చేసింది.మేటర్ ఏమిటంటే ఆరోగ్య సిబ్బందికి కాకుండా హాస్పిటల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొలి టీకా అందివ్వాలని కేసీఆర్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.పారిశుద్ధ్య కార్మికుల తర్వాత హెల్త్ కేర్ వర్కర్లకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.తొలిరోజు నాలుగు వేల మందికి ఇవ్వాలని ఇందుకోసం ఒక్కో కేంద్రంలో 30 మందికి టీకా వేయించే ఆలోచనలో టిఆర్ఎస్ సర్కార్ రెడీ అయ్యింది.