జనసేన తో బీజేపీ కి పొత్తు లేదా ? అరుణ చెప్పింది నిజమా ? 

బీజేపీ విషయంలో మొదటి నుంచి జనసేన పార్టీ అనేక అవమానాలకు గురవుతూనే వస్తోంది.బిజెపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి ఎన్నికల కోసం వెళ్లాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నాయి.

 Dk Aruna Senasational Comments On Bjp Janasena Alliance , Pavan ,janasena,bjp,ap-TeluguStop.com

అయితే పొత్తు పెట్టుకున్న మొదటి రోజు నుంచి జనసేన ను అవమానించే విధంగా బీజేపీ వ్యవహరించడం, ముఖ్యంగా కేంద్ర బిజెపి పెద్దలు జనసేన ను పట్టించుకోనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ అయితే జనసేనతో పొత్తు పెట్టుకోకముందు పవన్ తో సఖ్యత గా ఉంటూ వచ్చినా, పొత్తు పెట్టుకున్న తర్వాత మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు.

అప్పటి నుంచి ఇప్పటికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు.ఇక అనేక సందర్భాల్లోనూ జనసేనను బీజేపీ అవమానిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

అటు పవన్ కు ఏపీ, తెలంగాణలోనూ అనేక సందర్భాల్లో బీజేపీ నేతల తీరుతో అవమానాలు ఎదురయ్యాయి.అయినా ఎప్పటికప్పుడు పవన్ సర్ధికుపోతోనే వస్తున్నారు.

ఇదే ఇలా ఉంటే తాజాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, తెలంగాణ కు చెందిన డీకే అరుణ జనసేన విషయమై అనేక సంచలన విమర్శలు చేశారు.ఓ టీవీ డిబేట్ కార్యక్రమం లో పాల్గొన్న అరుణ కు బిజెపి- టిఆర్ఎస్ కు లోపాయికారి ఒప్పందం ఉందా అనే ప్రశ్న ఎదురయినప్పుడు టిఆర్ఎస్ తో ఎప్పటికీ తమకు పొత్తు ఉండదని , టిఆర్ఎస్ నాయకులు బీజేపీ వైపు వెళ్లకుండా టిఆర్ఎస్ పార్టీ ముందుగానే మైండ్ గేమ్ ఆడి ఉంటుందని, ఆ సందర్భంగా ఇటువంటి గాసిప్స్ వచ్చి ఉండవచ్చని అరుణ వ్యాఖ్యానించారు.

Telugu Bandi Sanjay, Bjp Presint, Bjpjanasena, Dk Aruna, Janasena, Narendra Modi

ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో బిజెపి కి తెలంగాణలో పొత్తు ఉందా అనే ప్రశ్న వచ్చినప్పుడు దీనికి అరుణ సమాధానం చెబుతూ, పవన్ కళ్యాణ్ కేవలం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితులై, జాతీయస్థాయిలో మోదీ ద్వారా పొత్తు పెట్టుకున్నప్పటకీ, ప్రాంతీయ స్థాయిలో తమకు జనసేన తో ఎటువంటి సంబంధం లేదు అని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా జనసేనకు రాబోయే రోజుల్లో ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనే ప్రశ్నకు అసలు తమకు పొత్తు లేనప్పుడు సీట్ల కేటాయింపు అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.ప్రస్తుతం అరుణ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా జనసేన అక్కడ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో బిజెపి నేతల ఒత్తిడితో పవన్ వెనక్కి తగ్గారు.

బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తాము ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పకటించిన సంగతి తెలిసిందే. గతంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం జనసేన పార్టీతో తమకు పొత్తు లేదంటూ ప్రకటించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.

ఇప్పుడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న డీకే అరుణ ఈ విధంగా వ్యాఖ్యానించడం చూస్తుంటే బీజేపీ పెద్దలు పవన్ ను పట్టించుకోవడం మానేశారా అనుమానాలు కలుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube