అకాల వర్షాలు , అంతుపట్టని వాతావరణంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
సరిగ్గా పంట చేతికందే సమయం లో కురిసిన ఈ వర్షాలతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వాలు మద్దతు ఇస్తామని , తడిసిన ధాన్యాన్ని కూడా మంచి రేటుకు కొంటామని ప్రకటన చేసినప్పటికీ వాస్తవంగా పరిస్థితి ఎలా వుంటుందో చెప్పలేం … ఇప్పటికే కుదలేన తెలుగు రాష్ట్రాల( Telugu states ) రైతులకు ఐఎండిఏ మరో హెచ్చరిక చేసింది .ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి స్పష్టత వస్తుందని మే తొమ్మిదో తారీఖు వరకు తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది…

ఈనెల 6తో తుపాను( Cyclone ) ఆవర్తనాలు మొదలవుతాయని ఎనిమిదవ తారీకు కు వాయుగుండం కేంద్రీకృతమై తుఫానుగా మారుతుందని ఉత్తర దిశగా ప్రయాణించి బంగాళాఖాతం లో వెళ్లే అవకాశం ఉందంటూ ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర ప్రకటించారు.అది ప్రయాణించే మార్గంపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.యెమన్ ప్రతిపాదించిన మేరకు దీనికి మోచా గా నామకరణ చేసినట్లుగా తెలుస్తుంది.

సంబంధిత వర్గాలను అప్రమత్తం చేసేందుకే ముందుగా వివరాలను ప్రకటిస్తున్నామని చెప్పిన ఆయన జాలర్లు వేటకు వెళ్లొద్దని ఆ దిశగా వారిని అప్రమత్తం చేసే చర్యలు మొదలు పెట్టామని చెప్పారు .ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్రంగా, మరికొన్ని రాష్ట్రాలపై సాధారణంగా తుపాను ప్రభావం ఉంటుందని ఆంధ్ర, ఒరిస్సా లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన ప్రకటించారు.ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఈ ప్రకటనతో( Formers ) మరింత ఆందోళన పడుతున్నారు.
ప్రభుత్వాలు చర్యలు తీసుకొని తగిన సహాయం చేయకపోతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.







