ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్( Whatsapp ) రోజుకొక కొత్త అప్డేట్ తెస్తూ వినియోగదారులను ఖుషీ చేస్తోంది.ఐతే ఇప్పుడు చెప్పుకోబోయే అప్డేట్ పాతదే అయినా చాలామంది నోటిస్ చేయడం లేదు.
అదేమిటంటే స్టేటస్ ఫీచర్.దీనిని వాట్సాప్ కొంత కాలం క్రితం పరిచయం చేసింది.
అయితే ఈ స్టేటస్ ఇతర యాప్స్‌కు షేర్ చేసుకునేలా ఓ ఫీచర్‌ను వాట్సాప్ దుబాటులోకి తెచ్చింది.దీని ద్వారా మీరు ఫేస్‌బుక్‌కి కూడా వాట్సాప్ స్టేటస్‌లను ఇపుడు చాలా తేలికగా షేర్ చేయవచ్చు.

ఎఫ్‌బీ న్యూస్ ఫీడ్( FB news feed ), గ్రూప్స్ లేదా స్టోరీలో దీన్ని పోస్ట్ చేసుకోవచ్చు.అంతేకాకుండా దాన్ని ప్రొఫైల్ పిక్‌గా కూడా సెట్ చేసుకోవచ్చు.ఇపుడు ఫేస్‌బుక్‌కి ( Facebook )వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌ను షేర్ చేయడం ద్వారా ఎక్కువమంది ఫాలోవర్స్ ని సంపాదించుకోవచ్చు.క్రియేటర్స్ కి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎలాంటి అదనపు టూల్స్ లేదా యాప్‌ల అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ యాప్ నుంచి షేర్ చేయగలిగే వేగమైన, సులభమైన ప్రక్రియ అని చెప్పుకోవాలి.స్టేటస్‌ను వాట్సాప్‌లో పోస్ట్ చేసి, ఈ కింద పేర్కొన్న సింపుల్ స్టెప్స్‌తో దానిని ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు.
దానికోసం ఇలా చేయండి.

1: మొదటగా స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి, స్టేటస్ ట్యాబ్‌కి వెళ్లాలి.2: ఇపుడు ఫేస్‌బుక్‌లో షేర్ చేయాలనుకుంటున్న స్టేటస్ అప్‌డేట్‌ను సెలక్ట్ చేసుకోవడానికి “మై స్టేటస్” ఆప్షన్‌పై నొక్కాలి.3: తరువాత స్టేటస్ అప్‌డేట్స్ మీకు కనిపిస్తాయి.అందులో ఫేస్‌బుక్‌కి షేర్ చేయదలుచుకున్న స్టేటస్ పక్కన కనిపించే త్రీ డాట్స్ పై క్లిక్ చేయాలి.4: అక్కడ ఇపుడు కనిపించే ఆప్షన్స్ లలో లేదా షేర్ టు ఫేస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.5: తద్వారా నేరుగా ఫేస్‌బుక్ స్టోరీస్‌లో వాట్సాప్ స్టేటస్‌ని పోస్ట్ చేయవచ్చు.6: స్టేటస్‌ను షేర్ చేసే ఫేస్‌బుక్‌లోని ఎవరెవరికి దానిని షేర్ చేయాలో సెలక్ట్ చేసుకోవచ్చు.7: కొత్తగా వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేస్తే దానికిందే షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ అని కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేయడం ద్వారా దానిని ఈజీగా ఎఫ్‌బీకి షేర్ అవుతుంది.







