సోషల్ మీడియాలో( Social Media ) నిత్యం ఎన్ని వీడియోలు వైరల్ అయినా, కొన్ని మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంటాయి.అలాంటి వీడియోలు జనులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి.
అంతేకాకుండా వాటిని మెచ్చి నెటిజన్లు మరింతమందికి షేర్ చేస్తూ వుంటారు.ఇపుడు అలాంటి వీడియో గురించే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం.
అవును, ఆ రకానికి చెందిన వీడియో ఇపుడు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది.

అన్న.అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం కలిపితే ‘అన్న’ ( Brother ) అని అంటారు.అందుకే అన్న.
తన చెల్లి, తమ్ముడులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని మన పూర్వికులు, పురాణాలూ చెప్పాయి.అయితే ఈ కాలంలో అలాంటి అన్నలు వున్నారు అనడం అతిశయోక్తి అవుతుంది కానీ, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో చూశారంటే అరె! నిజమేనా అలాంటి అన్నలు వున్నారు అని మీరు ఆశ్చర్యపోతారు.
అందులోనూ అన్నా చెల్లి అనుబంధం గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చెల్లెలిపై అన్నకు వల్లమాలిన ప్రేమ ఉంటుంది.
అదేవిధంగా అన్నలుపైన తమ చెల్లెలికి సముద్రమంత ప్రేమ ఉంటుంది.

ప్రస్తుత వీడియో దానికి తార్కాణం అని చెప్పుకోవాలి.అవును, తాజాగా అన్నా, చెల్లెలి అనుబంధానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియో గమనిస్తే, అన్నా, చెల్లి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో భారీ వర్షం( Rain ) కురవగా ఆ అన్నయ్య తన చెల్లి వర్షంలో తడకుండా ఉండేందుకు తన టీ షర్ట్‌నే చెల్లికి గొడుగుగా పట్టాడు.ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
అన్నాచెల్లెలి అనుబంధం చూసి అబ్బురపడిపోతున్నారు.







