తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( Telangana CM KCR ) తెలంగాణ గీత కార్మికులకు శుభవార్త తెలియజేశారు.రైతు బీమా తరహాలోనే కల్లు గీత కార్మికులకు( Geetha Workers ) కూడా బీమా కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కల్లు గీస్తూ ప్రాణాలు కోల్పోయే గీత కార్మికులకు 5 లక్షల రూపాయలు బీమా కల్పించబోతున్నట్లు పేర్కొన్నారు.ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించడం జరిగింది.
ప్రస్తుతం అందిస్తున్న నష్టపరిహారం ఆలస్యం అవుతున్నందున కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది.కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల తెలంగాణ గీత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితమే గీత వృత్తిలో కార్మికుల మరణాలు ప్రమాదాలను నివారించడానికి.సేఫ్టీ యంత్రాలను అందించడానికి తక్షణమే అధికారులు నివేదిక ఇచ్చేలా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Excise Minister Srinivas Goud )ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి వందలాదిమంది మృతి చెందడం లేదా శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారని.అటువంటి ప్రమాదాలను నివారించడానికి సేఫ్టీ యంత్రాలను తీసుకురావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రెడీ అయింది.
ఈ క్రమంలోనే గీత కార్మికులకు ఐదు లక్షల బీమా కల్పిస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది.