నిహారిక కొణిదెల( Niharika Konidela) పరిచయం అవసరం లేని పేరు మెగా డాక్టర్ గా ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టిన నిహారిక అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు అయితే ప్రస్తుతం నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాణ రంగంలో స్థిరపడిపోతున్నారు.ఇక నిహారిక గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిహారిక తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు( Venkata Chaitanya ) విడాకులు ఇవ్వబోతున్నారంటూ వార్తలు షికారులు చేస్తున్న కూడా ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు.
అయితే నిహారిక మాత్రం పరోక్షంగా విడాకుల( Divorce ) గురించి ఓపెన్ అయ్యారని తెలుస్తుంది.

నిహారిక పెద్ద ఎత్తున జిమ్ లో కష్టపడుతూ భారీ వర్కౌట్లు( Niharika Workouts ) చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇందులో ఈమె కొన్ని హెల్త్ టిప్స్( Health Tips ) తో పాటు మోటివేషనల్ టిప్స్ కూడా అభిమానులతో పంచుకున్నారు.
అలాగే అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుంది అంటూ ఒక పాయింట్ కూడా ఇందులో యాడ్ చేశారు.అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుంది అంటూ ఈమె చెప్పడంతో తన భర్తతో విడాకులు తీసుకున్నారని పలువురు భావిస్తున్నారు.

ఇలా నిహారిక ఈ విధమైనటువంటి కొటేషన్( Quotation ) షేర్ చేయడంతో తన భర్త జ్ఞాపకాల నుంచి ఈమె బయటపడటానికి మెల్లిమెల్లిగా ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే ఇలా వృత్తి పరమైన జీవితంలో నిహారిక ఎంతో బిజీ అవుతున్నారు అంటూ పలువురు భావిస్తున్నారు.అయితే నిహారిక మనసుకు తగిలిన ఈ గాయాల నుంచి బయటపడి తాను కెరియర్లో సక్సెస్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.ప్రస్తుతం నిహారిక చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసి పలు సినిమా కథలను వినే పనిలో నిహారిక బిజీగా ఉన్నారు.







