ఎన్నికల ప్రచారం మొదలెట్టనున్న జగన్ ! తొలి సభ ఎక్కడంటే..?

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నారు.

వచ్చే ఎన్నికలే టార్గెట్ గా వైసీపీ నియోజకవర్గ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు.

భారీగా మార్పు చేర్పులు చేపట్టారు.ఇక పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లేందుకు జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు .వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తున్న జగన్, దానిని నిజం చేసే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు.దీనిలో భాగంగానే భీమిలి( Bheemili ) నుంచి ఈ నెల 25న ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ మేరకు రాష్ట్రాన్ని ఐదు జోన్ లుగా విభజించి,  ప్రతి జోన్ లో కార్యకర్తలతో ముఖాముఖి నిమిత్తం బహిరంగ సభ నిర్వహించే విధంగా ప్లాన్ చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే  లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.

ఏపీలో ఎన్నికలకు( AP Elections ) సమయం దగ్గర పడడంతో పూర్తిగా ఎన్నికల ప్రచారంపైనే దృష్టి పెట్టారు.దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు.

Advertisement

ఈ మేరకు ఈనెల 25న జగన్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలకు సంబంధించి భీమిలిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.ఈ సభ నిర్వహణపై ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర కీలక నేతలకు ఇప్పటికే జగన్ దిశ నిర్దేశం చేశారు.తొలి బహిరంగ సభను భారీగా నిర్వహించే విధంగా జగన్ కసరత్తు చేస్తున్నారు.

తొలి ఎన్నికల ప్రచార సభను ప్రతిష్టాత్మకంగా జగన్ తీసుకుని ఆ మేరకు దృష్టి పెట్టారు.

ఉత్తరాంధ్రలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు నుంచి 6000 మంది కార్యకర్తలు హాజరయ్యే విధంగా ప్లాన్ చేశారు .ఎన్నికల ప్రచార సభ( Elections Campaign ) నిమిత్తం ఏపీని 5 జోన్లుగా విభజించి పార్టీ కేడర్ తో సమావేశాలు ప్లాన్ చేశారు.ఎన్నికల ప్రచారంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం అవుతారని , రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సిద్ధం చేయడమే లక్ష్యంగా జగన్ ఈ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు