CM Jagan : ఈనెల 23న ఒంగోలుకు సీఎం జగన్.. వేడెక్కిన రాజకీయాలు.!!

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఈనెల 23వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించనున్నారు.

ఇందులో భాగంగా భూ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

అయితే ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులకు వైసీపీ ప్రభుత్వం ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది.రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానాన్ని మరోసారి మాగుంటకు కేటాయించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని( Former minister Balineni ) తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేదు.

అలాగే ఇప్పటివరకు ఒంగోలు వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించలేదు.ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని( Chevireddy Bhaskar Reddy ) ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి ఏడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

చెవిరెడ్డి రాకతో మాగుంట అనుచరులు వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.మరోవైపు వైసీపీ అధిష్టానం సీటు ఇవ్వని నేపథ్యంలో మాగుంట ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారని, ఇందులో భాగంగా ఆయన టీడీపీలోకి చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement

ప్రస్తుత పరిస్థితులతో ఒంగోలు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు