ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 17వ తారీఖున విశాఖపట్టణం పర్యటించనున్నారు.ఏన్ఏడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.
ఇదే సమయంలో విజయనగరం డిసిసిబి ఛైర్మన్ కుమార్తె వేడుకల్లో పాల్గొని అనంతరం జివిఎంసి… చేపట్టిన ఉడా పార్క్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు వివాహ రిసెప్షన్ లో సీఎం జగన్ హాజరుకానున్నారు.
సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.శుక్రవారం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో విశాఖపట్టణానికి సీఎం జగన్ వెళ్లనున్నట్లు సమాచారం.

కాగా వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత.పెద్ద ప్రాతిపదికన అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.అదే రీతిలో పర్యాటక రంగంగా విశాఖ ని తీర్చిదిద్దుతూ ఆ తరహాలో… సుందర నగరం గా ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేలా.మరిన్ని పెద్దపెద్ద కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వం చేపట్టింది.
ప్రపంచంలోనే అతిపెద్ద జెయింట్ వీల్.ఇంకా మరిన్ని కార్యక్రమాలు విశాఖ కేంద్రంగా వైసీపీ చేస్తూ ఉంది.
ఈ తరుణంలో 17వ తారీకు సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు.ప్రారంభించడానికి వస్తూ ఉండటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.