రివర్స్ గేర్ లో మోదీ ' రాజకీయం ' ?

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై జనాలకు మొహం మొత్తడం తో పాటు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తీరు దేశవ్యాప్తంగా అందర్నీ ఆలోచనలో పడేసింది.అటువంటి మహోన్నతమైన వ్యక్తి భారత దేశ ప్రధాని గా ఉంటే దేశం ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి వెళ్తుందని దేశ ప్రజలంతా నమ్మారు.

 Narendra Modi Declining Political Graph Across The Country, Prime Minister Of In-TeluguStop.com

అదుకే 2014 ఎన్నికలలో దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీచింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు .అధికారం చేపట్టిన దగ్గర నుంచి మోడీ తన మార్క్ కనిపించేలా దేశవ్యాప్తంగా పరిపాలనా స్వరూపాన్ని మార్చివేశారు.ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారు.

నిజాయితీపరుడిగా, ఏది చేసిన ప్రజల కోసమే తాను చేస్తున్నట్లుగా మోదీ నమ్మకం కలిగించారు.మోడీ రాజకీయానికి ఎంతోమంది పేరుమోసిన సీనియర్ నాయకులు సైతం రాజకీయ ఉనికిని కోల్పోయారు.

ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ సైతం దేశవ్యాప్తంగా ఉనికి కోల్పోయే పరిస్థితి కి తీసుకువచ్చారు.
  అప్పట్లో మోదీ గాలి ఆ విధంగా వీచింది.2019 ఎన్నికల్లోనూ అదే ఊపు కనిపించింది.2019 ముందు చేపట్టిన నోట్ల రద్దు అంశాన్ని కూడా ప్రజలు దేశంలో అవినీతిని పారద్రోలాని కి సరైన మార్గం గా మోదీ నిర్ణయాన్ని సమర్థించారు .అప్పట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అవన్నీ మర్చిపోయారు.కానీ ఆ నోట్ల రద్దు కారణంగా కలిగిన ప్రయోజనం ఏమీ లేదని విషయం అర్థమైపోయింది.2019 ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుందని అంతా భావించినా , పుల్వామా ఘటనలో భారత సైనికులు 40 మంది మరణించడం , దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని బాలకోట్ ఉగ్ర శిబిరాన్ని భారత వైమానిక దళం ధ్వంసం చేయడం వంటి కారణాలతో మోదీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో మరోసారి ఆయన ప్రధానమంత్రి అయ్యేందుకు కారణం అయింది.

అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం, తీవ్రమైన వాక్సిన్ కొరత తో పాటు ఎన్నో సమస్యలు దేశాన్ని చుట్టుముట్టాయి.
  ఈ సమయంలో సమర్థవంతంగా వ్యవహరించాల్సిన ప్రధాని కేవలం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయము జనాల్లోకి వెళ్లిపోయింది.

Telugu Bharath, Carona, Central, Corporate, Covid, Gujarath, India Corona, Modhi

కేవలం భారత్ లోనే కాదు అంతర్జాతీయంగా మోదీ గ్రాఫ్ తగ్గిపోవడం బిజెపి శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది.కరోనా విషయంలో ముందుచూపు కొరవడడం వంటి కారణాలతోనే ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ను మోదీ విమర్శలు ఎదుర్కొంటున్నారు.2014 19 ఎన్నికల సమయంలో ఉన్న మోదీ ఇమేజ్ ఇప్పుడు భారీగా తగ్గిపోవడం బిజెపి మిత్ర పక్షాలు సైతం ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల భారత్ లో నెలకొన్న పరిస్థితులపై మోదీ ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియో పై ఎక్కువగా వస్తుండడం ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతోంది.

   

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube