న్యూస్ రౌండప్ టాప్ 20 

1.హైదరాబాద్ లో యూకే స్ట్రెయిన్


 Clt 2021 Application Receipt, Rajinikanth Will Not Start A Political Party, T-TeluguStop.com

కరోనా కొత్త స్ట్రెయిన్ హైదరాబాద్ కు ప్రవేశించింది.

యూకే నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరిలో ఈ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.వారిని ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

2.‘ క్లాట్ 2021 ‘ దరఖాస్తుల స్వీకరణ


Telugu Clt Receipt, Towers Farmers, Gold, Kodalinanis, Prisondrunken-General-Tel

హైదరాబాదులోనా సార్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయం ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ( క్లా ట్ ) 2021 నోటిఫికేషన్ విడుదలైంది.జనవరి 1 నుంచి మార్చి 31 వరకు  దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని క్లాట్ 2021 కన్వీనర్ ప్రొఫెసర్ విజయేందర్ తెలిపారు.

3.హీరో రామ్ చరణ్ కు కరొనా పాజిటివ్


టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

4.రజినీకాంత్ సంచలన ప్రకటన


Telugu Clt Receipt, Towers Farmers, Gold, Kodalinanis, Prisondrunken-General-Tel

ఇప్పట్లో తాను రాజకీయ పార్టీని ప్రారంభించ లేను అని, అనారోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నాను అని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు.

5.ఎఫ్ 3 సినిమాలో అభిజిత్


బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్ కు ఎఫ్ 3 సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

6.డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పదేళ్ల జైలు


Telugu Clt Receipt, Towers Farmers, Gold, Kodalinanis, Prisondrunken-General-Tel

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఇక పై పదేళ్ల జైలు శిక్ష పడుతుందని , మద్యం సేవించి వాహనాలు నడిపే వారు టెర్రరిస్టుల తో సమానం హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

7.కొత్త రక కరోనా పై ఆందోళన వద్దు


బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ భారత్ లోనూ బయట పడుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీసీ ఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్ర స్పందించారు.కొత్త వైరస్ అంత ప్రమాదకరం ఏమి కాదు అని, ఇది కరోనా వైరస్ రకమేనని ఆయన ప్రకటించారు.

8.స్థానిక సంస్థల ఎన్నికల పై హైకోర్టు కీలక ఆదేశాలు


Telugu Clt Receipt, Towers Farmers, Gold, Kodalinanis, Prisondrunken-General-Tel

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో ప్రభుత్వం చర్చించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

9.కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్


కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

10.తెలంగాణలో కరోనా 


Telugu Clt Receipt, Towers Farmers, Gold, Kodalinanis, Prisondrunken-General-Tel

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 397 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

11.విద్యార్థి ప్రాణం తీసిన ఆన్లైన్ రమ్మీ


ఆన్లైన్ రమ్మీ ఓ విద్యార్థి ప్రాణాలను బలితీసుకుంది.

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ కు చెందిన అభిలాష్ ( 25 ) అనే సీఏ విద్యార్థి డబ్బులు పెట్టి ఆన్లైన్లో రమ్మీ ఆడాడు.డబ్బుల కోసం అప్పులు చేసి అవి కట్టలేక మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

12.పవన్ పై కొడాలి నాని సంచలన కామెంట్స్


Telugu Clt Receipt, Towers Farmers, Gold, Kodalinanis, Prisondrunken-General-Tel

నిన్న ఏపీ మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ గా కొడాలి నాని పవన్ పై విమర్శలు చేశారు.పవన్ వకీల్ సాబ్ అని చెప్పుకుంటున్నారని, కానీ ఆయనను అందరూ షకీలా సాబ్ అనుకుంటున్నారు అంటూ విమర్శించారు.

13.ఏపీ రైతులకు ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ


రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 1766 కోట్లు జమ చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.

14.రైతులకు మద్దతు గా మొబైల్ టవర్ల ధ్వంసం


Telugu Clt Receipt, Towers Farmers, Gold, Kodalinanis, Prisondrunken-General-Tel

నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా పంజాబ్లో సెల్ ఫోన్ టవర్ల ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

15.పెళ్లి చేసుకోవాలని కీర్తి సురేష్ పై ఒత్తిడి


హీరోయిన్ కీర్తి సురేష్ కు సంబంధించిన వార్తలు గత కొద్ది రోజులుగా వస్తూనే ఉన్నాయి.ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది.తాజాగా కీర్తి సురేష్ తల్లితండ్రులు సైతం ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండగా దానికి కీర్తి ఒప్పుకోవడం లేదు అనే ప్రచారం జరుగుతోంది.

16.ఏపీలో యూకే స్ట్రెయిన్


Telugu Clt Receipt, Towers Farmers, Gold, Kodalinanis, Prisondrunken-General-Tel

ఏపీ లోనూ కరొనా కొత్త వైరస్ స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది.యూకే నుంచి ఏపీకి వచ్చిన వారిలో 11 మందికి కరోనా పరీక్షలు నిర్థారణ అయింది.వారిలో రాజమండ్రికి చెందిన ఒకరికి యూకే స్ట్రెయిన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.

17.జల్లికట్టు పై కీలక నిర్ణయం


తమిళనాడులో జరిగే జల్లికట్టు ఈసారి కోవిడ్ నిబంధన కారణంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అని అంతా భావించగా, కొన్ని షరతులతో ఈ క్రీడను జరుపుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

18.ఈరోజు బంగారం ధరలు


Telugu Clt Receipt, Towers Farmers, Gold, Kodalinanis, Prisondrunken-General-Tel

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,220

19.చైనాలో కోవిడ్ టీకాలు పంపిణీ


కరొనా వైరస్ పుట్టినిల్లు గా భావిస్తున్న వుహన్ నగరంలో చైనా ప్రభుత్వం టీకా  కార్యక్రమాన్ని ప్రారంభించింది.

20.అమెరికాలో రోడ్డు ప్రమాదం.నల్గొండ వాసి మృతి


Telugu Clt Receipt, Towers Farmers, Gold, Kodalinanis, Prisondrunken-General-Tel

నల్గొండ జిల్లాకు చెందిన నల్లమడ దేవేందర్ రెడ్డి ( 45) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube