20 తర్వాత సడలింపులు.. కర్ఫ్యూ కొనసాగుతుందన్న సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

కొవిడ్ వ్యాప్తి కట్టడి, హెల్త్ క్లీనిక్స్, ఉపాది హామీ, ఇళ్ల పట్టాలు, ఖరీఫ్ కు రెడీ అవడం తదితర అంశాలపై చర్చలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని.క్రమంగా పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతుందని తెలిపారు.

అయినా సరే ఈ నెల 20 తర్వాత కూడా కొన్ని సడలింపులులతో కూడిన కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేలా అధికారులను నిర్ధేశించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 69 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చామని, 26 లక్షల 33 వేల మందికి రెండు డోస్ లు ఇచ్చామని తెలిపారు.గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలని ఆదేశించారు.

Advertisement

రాష్ట్రంలో కొవిడ్ చికిత్స ఆరోగ్య శ్రీ కిందకి తెచ్చామని 89 శాతం మంది కరోనా బాధితులు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందారని జగన్ చెప్పారు.ఏపీలో పిల్లల కోసం 3 కొత్త హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తునంట్టు వెల్లడించారు.

వైజాగ్, కృష్ణా-గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో ఉంటాయని చెప్పారు.కరోనా థర్డ్ వేవ్ పై కూడా జగన్ చర్చించారు.

థర్డ్ వేవ్ వస్తే అందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉందని అన్నారు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు