వైరల్' సీఎంనా మజాకానా..! తన సొంత డబ్బులతో..!?

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మాములు విషయమా చెప్పండి.సీఎం అంటే చాలు ఆయనకు ఇచ్చే గౌరవ మర్యాదలు ఒక రేంజ్ లో ఉంటాయన్నమాట.

సీఎం ఎక్కడికన్నా వస్తున్నాడంటే చాలు ఆ రోజంతా పోలీసులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.ఆయన వెనుక వచ్చే ఆ కాన్వాయే చాలా పెద్దగా ఉండడంతో పాటు ఆయన వెనుక నిత్యం ఎన్నో వాహనాలతో పాటు, ఆయనను ఎల్లవేళలా కాపాడడానికి వందల సంఖ్యలో సెక్యూరిటీ గార్డ్స్, పోలీసులు నిత్యం ఆయన చుట్టూ పహారా కాస్తూ ఉంటారు.

అలాగే సీఎం కాన్వాయ్ వస్తుందంటే చాలు రోడ్డు మీద వాహనాలు అన్నీ ఎక్కడివి అక్కడే ఆపేసి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు.వాళ్ళు చేసే హడావుడి, హంగామా చూస్తుంటే ఎవరో ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు అనే విషయం అందరికి అర్ధం అయిపోతుంది.

మరి ముఖ్యమంత్రికి ఇన్ని సదుపాయాలు ఉన్నాగాని వాటి అన్నిటిని ఉపయోగించుకోకుండా ఒక సాధారణ వ్యక్తిలా ఆటోలో ప్రయాణం చేసి తన సొంత డబ్బులతో ఒక హోటల్ కి వెళ్లి భోజనం చేసిన ఘటనకు సంబదించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.అసలు ఇంతకీ ఆయన ఏ రాష్ట్రానికి చెందిన సీఎం అనే కదా మీ డౌట్.

Advertisement

అది క్లియర్ చేసుకోవాలంటే అసలు వివరాలలోకి వెళ్ళాలిసిందే.

ఆయన మరెవరో కాదు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.ఎంత పెద్ద హోదాలో ఉన్నగాని వాటన్నిటిని పక్కన పెట్టి ఒక సాధారణ వ్యక్తిలా ఆటో ఎక్కి ఒక భోజన హోటల్ కు వెళ్లి తన సొంత డబ్బులతో భోజనం చేశారు.ఆయన అలా భోజనం చేస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇది చూసిన నెటిజన్లు ఈ కాలంలో కూడా ఇలాంటి సీఎం ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు.అలాగే మరికొందరు.సీఎం సార్, మీరు గ్రేట్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు