తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.అయితే అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేసి, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన పార్టీగా మారాలని తెలుగు దేశం పార్టీ భావిస్తోంది.
అందుకోసం ఇప్పటి నుండే కసరత్తులు చేయడం ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతో బిజీగా ఉన్నా కూడా తెలంగాణలో పార్టీని బతికించుకోవాలనే ఉద్దేశ్యంతో యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా యాత్రపై తెలుగు తమ్ములు చాలా ఆశలే పెట్టుకున్నారు.బాబు పర్యటనతో తెలంగాణలో పార్టీకి పునరుత్తేజం వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
అయితే బాబు చేయబోతున్న రెండు రోజుల పర్యటనతో తమ్ముళ్లు ఊహిస్తున్నది జరగడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.బాబు చేస్తున్నది కేవలం ఒక్క జిల్లా పర్యటన మాత్రమే అని, అది కూడా టీఆర్‌ఎస్‌కు బాగా పట్టున్న వరంగల్ జిల్లా అవ్వడంతో పెద్దగా ఉపయోగం ఉండదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తానికి టీడీపీ పార్టీ నాయకుల ఆశలు బాబు యాత్రతో నెరవేరేనో చూడాలి.