ప్ర‌భుత్వంలో హ‌రీశ్‌రావుకు మ‌ళ్లీ పెరుగుతున్న ప్రాముఖ్య‌త‌.. ఈట‌ల ఎఫెక్ట్ కార‌ణ‌మా?

హ‌రీశ్‌రావు అంటే కేసీఆర్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడైన వ్య‌క్తిగా పేరుంది.ఏదైనా ప‌ని అప్ప‌జెప్పితే ఆయ‌న దాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేస్తార‌నే న‌మ్మ‌కం కేసీఆర్‌కు ఉంది.

 Hareesh Rao Importance Is Growing In Trs Due To Etela Effect , Harish Rao, Trs,-TeluguStop.com

అందుకే ఎన్నిక‌ల వ్యూహాల‌కు సంబంధించిన విష‌యాల్లో ఎక్కువ‌గా హరీశ్‌రావునే ఉప‌యోగిస్తుంటారు కేసీఆర్‌.కానీ గ‌త ప్ర‌భుత్వంలో హ‌రీశ్‌రావుకు ఇచ్చిన ప్రాముఖ్య‌త ఈ ప్ర‌భుత్వంలో లేద‌నేది కాద‌న‌లేని స‌త్యం.

చాలా వ‌ర‌కు హ‌రీశ్‌రావును నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం చేశారు కేసీఆర్‌.ప్ర‌భుత్వ ప‌ర‌మైన ఏ హామీల‌ను కూడా హ‌రీశ్‌రావు ఇవ్వ‌కుండా క‌ట్ట‌డి చేశారు.ఈ విష‌యంలో కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు మాత్ర‌మే స్వేచ్ఛ ఉంది.అయితే ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేశారో అప్ప‌టి నుంచి కేసీఆర్ మ‌ళ్లీ హ‌రీశ్‌రావుకు ప్ర‌భుత్వంలో ఎక్కువ ప్రాముఖ్య‌త ఇస్తున్నారు.

ఇంకోవైపు ఈట‌ల రాజేంద‌ర్ కూడా హరీశ్‌రావుకు ఎక్కువ అవ‌మానాలు జ‌రిగాయ‌ని చెప్ప‌డంతో కేసీఆర్ అల‌ర్ట్ అయ్యారు.

ఉద్య‌మ‌కారుల‌కు టీఆర్ ఎస్‌లో గౌర‌వం లేద‌న్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు హరీశ్‌రావును ద‌గ్గ‌రికి తీసుకుంటున్నారు.

Telugu @ktrtrs, Covidcontrol, Hareeshrao, Harish Rao, Trs, Trs Strategist-Telugu

ఆయ‌న‌కు మ‌ళ్లీ పూర్వ వైభ‌వం క‌ల్పించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.ఇందులో భాగంగా మొన్న‌టికి మొన్న కొవిడ్ కంట్రోల్ స్టాండింగ్ క‌మిటీకి చైర్మ‌న్‌గా హరీశ్‌రావును నియ‌మించారు.కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రితో జ‌రిగే ప్ర‌తి వీడియోకాన్ఫ‌రెన్స్‌కు హ‌రీశ్‌రావే ప్ర‌భుత్వం త‌ర‌ఫున హాజ‌ర‌వుతున్నారు.అంతేకాదు కేసీఆర్ ఆస్ప‌త్రుల విజిట్‌కు వెళ్లిన‌ప్పుడు కూడా హరీశ్‌రావును వెంట పెట్టుకుని మ‌రీ వెళ్లారు.

ఇక నిన్న కేబినెట్ మీటింగ్‌లో స‌ర్కారు ఆస్ప‌త్రులపై స్ట‌డీ చేసి మెరుగైన స‌దుపాయాలు క‌ల్పించేందుకు హరీశ్‌రావు అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌బ్ క‌మిటీని నియ‌మించారు.ఈ విధంగా హ‌రీశ్ రావుకు పెద్ద పీట వేస్తూ చేజారిపోకుండా చూసుకుంటున్నారు కేసీఆర్‌.

ఇంకోవైపు హుజూరాబాద్ రాజ‌కీయాల బాధ్య‌త‌ల‌ను కూడా హ‌రీశ్‌రావుకే అప్ప‌గించి వ్యూహాత్మ‌కంగా ఈట‌ల‌ను దెబ్బ‌కొట్టేందుకు ప్లాన్ వేశారు గులాబీ బాస్‌.మ‌రి కేసీఆర్ అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను హ‌రీశ్‌రావు ఏ మేర‌కు నిర్వ‌హిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube