గాలిని నిమిషాల్లోనే శుభ్రం చేసేస్తుంది.. ఈ రోబో ఎయిర్ ప్యూరిఫైయర్ చూశారా?

గాలి వల్ల కూడా సోకే కరోనా వైరస్ బారిన నుంచి తప్పించుకోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడటం చాలామంది మొదలుపెట్టారు.

ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఇంట్లో ఎయిర్ ఫ్యూరిఫైయర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఎయిర్ ప్యూరిఫైయర్లు అనేవి గాలిని శుభ్రపరుస్తాయి.గాలిలోని వైరస్, బ్యాక్టీరియాను నిర్మూలించి స్వచ్చమైన గాలిని అందిస్తాయి.

గాలిలోని మలినాలను తొలగించి స్వచ్చమైన గాలిని అందిస్తాయి.ఇంట్లోని గదిలో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేసుకుంటే స్వచ్చమైన గాలిని పీల్చుకోవచ్చు.

అయితే ఎయిర్ ప్యూరిఫైయర్ల( Air purifier )లో చాలా రకాలు ఉన్నాయి.తాజాగా కొరియన్ డిజైనర్ సాంగ్ ఇల్ సిన్ కంపెనీ ప్లాని( Sang il Shin ) పేరుతో సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ ను అందుబాటులోకి తెచ్చింది.ఆ కంపెనీ రోబో ఎయిర్ ప్యూరిఫైయర్‌ను తయారుచేసింది.

Advertisement

రోబో ప్యూరిఫైయర్ అనేది ఇల్లు మొత్తం తిరుగుతూ గాలిలోని తేడాలను గుర్తిస్తుంది.దానికి అనుణంగా అది పనిచేస్తూ ఉంటుంది.

ఈ మెషిన్ లో సెన్సార్లను కూడా ఏర్పాటు చేశారు.ఆ సెన్సార్లు కదలికలను గుర్తించి ఏవైనా అడ్డు తగిలితే పక్కకు జరిపి ముందుకు వెళుతుంది.

ధుమ్ము, ధూళి, పొగ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఆగి ఉంటుంది.

నిమిషాల్లోనే ఈ రోబో ప్యూరిఫైయర్ గాలిని శుభ్రపరుస్తుంది.ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పుడు అందరినీ ఆక్టుకుంటుంది.అయితే ఈ రోబో ప్యూరిఫైయర్ ధర ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

త్వరలోనే తయారీ కంపెనీ ధరలను ప్రకటించే అవకాశముంది.త్వరలోనే ఈ రోబో ప్యూరిఫైయర్లు మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

వీటికి మార్కెట్ లో బాగా డిమాండ్ ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది.కరోనా తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్ల వినియోగం బాగా పెరిగిపోయింది.

దీంతో వాటి సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి.

తాజా వార్తలు