రోడ్డు మీద తన్నుకున్న టీడీపీ - బీజేపీ నేతలు

ఇప్పటికే కేంద్ర స్థాయి నుంచీ , రాష్ట్ర స్థాయి వరకూ బీజేపీ - తెలుగు దేశం ల మధ్యన వ్యవహారం సరిగ్గా నడవడం లేదు.

దీనికి తోడు ఇలాంటి వ్యవహారాలు ఇంకా ఇబ్బంది కరంగా మారుతున్నాయి.

టీడీపీ - బీజీపీ లు మిత్రపక్షాలే గానీ పార్లమెంటు ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు మద్దతు విషయం లో గొడవలు పడుతున్నాయి.కేంద్రం లోనే కాకుండా అమరావతి దగ్గరి గుంటూరు లో ఏకంగా రోడ్డు మీదే కొట్టుకున్నారు ఇరు పార్టీల నేతలూ.

అర్బన్ బ్యాంక్ గుంటూర్ కి చెందిన చైర్మన్ పదవి కోసం రెండు పార్టీల నేతలూ వాదానికి దిగారు.అర్బన్ బ్యాంక్ దగ్గరకి వెళ్లి గొడవ గొడవ చేసారు.

గుంటూరు అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవి ఏపీలోని అధికార మిత్రపక్షాలు టీడీపీ - బీజేపీల మధ్య వేడి పెంచింది.ఇప్పటికే పలు విషయాల్లో వాదనలకు దిగిన ఈ రెండు పార్టీలు గుంటూరు అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవి కోసం తాజాగా ఘర్షణకు దిగాయి.

Advertisement

ఈ రోజు ఉదయం గుంటూరులోని బ్రాడీపేటలో ఉన్న బ్యాంకు కార్యాలయం వద్దకు ఇరు పార్టీల నేతలు వేర్వేరుగా చేరుకున్నారు.చైర్మన్ పదవి కోసం ఇరు పార్టీలు వేర్వేరుగా నామినేషన్ల దాఖలుకు సిద్ధపడ్డాయి.

ఈ సందర్భంగా అక్కడ రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్న రెండు పార్టీల నేతలు ఆ తర్వాత ఒకరినొకరు తోసుకున్నారు, తన్నుకున్నారు .వెరసి రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు.దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు