ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టుకు సిట్

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై సిట్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.ఈ మేరకు సిట్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

కాగా సిట్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారణకు కోర్టు స్వీకరించింది.బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామితో పాటు శ్రీనివాస్ పేర్లను నిందితుల జాబితాలో చేర్చుతూ సిట్ దాఖలు చేసిన మెమోను నిన్న ఏసీబీ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా కేసు దర్యాప్తు చేయడానికి సిట్ కు అధికారం లేదని స్పష్టం చేసింది.ఏసీబీ మాత్రమే కేసును దర్యాప్తు చేయాలని వ్యాఖ్యనించింది.

ఈ నేపథ్యంలో సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement
నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?

తాజా వార్తలు