టీడీపీకి ఆ 'గ్లామర్' తగ్గిందే ?

అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే సినీ గ్లామర్ ఎక్కువ.

ఆ పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి రావడంతో మొదటి నుంచి టీడీపీకి సినీ గ్లామర్ ఎక్కువగా ఉంటూ వస్తోంది.

ఆ పార్టీలో చేరిన వారు అనేక పదవులు అనుభవిస్తూ వచ్చారు.సినిమా వారిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులే అయినా, ఈ సారి ఆ పార్టీకి ప్రచారం చేయడానికి సినీ ప్రముఖులెవరూ ఇష్టపడడంలేదు.

ఎన్నికల ప్రచారానికి వారంతా దూరంగానే ఉంటున్నారు.ప్రస్తుతం సినీ ఫీల్డ్ కి సంబందించిన వారంతా ఎక్కువగా వైసీపీలోనే కనిపిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ పరిస్థితి మరీ దయనీయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రచారం చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకన్న ఆలోచన టీడీపీకి అనుకూలంగా ఉన్న కొందరు సినీ ప్రముఖుల్లో కనిపిస్తోంది.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో వారంతా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నందమూరి హరికృష్ణ కుమార్తె, సుహాసిని తరఫున సినీ నటుడు, ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ ప్రచారం చేసినప్పటికీ, అక్కడ చేదు ఫలితాలే ఎదురయ్యాయి.

ఈ ఫలితాలను ముందుగా అంచనా వేసే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.అప్పటి నుంచి సినీ ప్రముఖల్లో ఎక్కువమంది టీడీపీ నుంచి దూరంగా జరుగుతూ వస్తున్నారు.

గుంటూరు లోక్ సభ స్థానంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న గల్లా జయదేవ్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఆయన బావమరిది మహేష్ బాబు ఇష్టపడడంలేదు.ఇదే సమయంలో వైసీపీ లో సినీ నేపధ్యం ఉన్నవారు ఎక్కువగా కనిపిస్తూ ప్రచారంలో మునిగితేలుతున్నారు.

ఈ విషయంలో బాగా వెనకబడ్డామనే ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు