తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ ఒక్క కేసు మాత్రమే ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, అంగళ్లు కేసులు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో తాజాగా చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది.
మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై పీసీ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు.చంద్రబాబును ఏ3 నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై విచారణకు కోర్టు అనుమతించింది.ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో( skill development ) చంద్రబాబు అరెస్టు అయి 50 రోజులు దాటిపోయింది.ఈ కేసులో ఇప్పటికీ బెయిల్ దొరకలేదు.ఈ క్రమంలో వరుస కేసులు చంద్రబాబుపై నమోదు అవుతూ ఉండటంతో తెలుగుదేశం పార్టీ నేతలు విచారణ వ్యక్తం చేస్తున్నారు.
సరిగ్గా ఎన్నికలకు ముందు రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసులు నమోదు చేస్తున్నారని.వ్యాఖ్యానిస్తున్నారు.
ఏది ఏమైనా చివరకి న్యాయం గెలుస్తుంది అని అంటున్నారు.మరోపక్క చంద్రబాబు ఆరోగ్య కారణాలతో వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.
ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం అక్టోబర్ 31వ తారీకుకి తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది.