ఏపీ ఫైబర్ నెట్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు.. రూ.321 కోట్ల స్కామ్ లో 16మందిపై ఎఫ్ఐఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ లో రూ‌.321 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన రెండు నెలలకు ఎఫ్ఐఆర్ ను ఆంధ్రప్రదేశ్ క్రైం దర్యాప్తు సంస్థ (సీఐడీ) నమోదు చేసింది.ఫైబర్ నెట్ టెండర్లు అవినీతి నేపథ్యంలో 16 మందిపై ఎఫ్ఐఆర్ ను న్యాయస్థానానికి సమర్పించింది.గత ప్రభుత్వం ‘టెరా సాప్ట్ వేర్’ కు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి.

 Cid Probe Into Ap Fiber Net Irregularities Fir Registered Against 16 Persons In-TeluguStop.com

తొలిదశ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ టెండర్ లో అవినీతి జరిగిందని తెలిసింది.ఈక్రమంలో వేమూరి, టెరా సాప్ట్ వేర్, అప్పటి అధికారులపై కేసు నమోదు అయ్యింది.

బ్లాక్ లిస్టులో కంపెనీకి గత ప్రభుత్వం అవకాశం కల్పించింది.ఫోర్జరీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తో మోసం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.ఈనెల 9 న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో  ప్రతి శనివారం బయటికి వచ్చింది.16 మంది పేర్లు, రెండు కంపెనీలను నిందితుల జాబితాలో సీఐడీ పేర్కొంది.

ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతం రెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో రూ‌.321  కోట్ల టెండర్ వేమూరి హరికృష్ణ ప్రసాద్, టెరా సాప్ట్ వేర్ లిమిటెడ్ తో కలిసి అక్రమంగా దక్కించుకున్నట్లు సీఐడీ వెల్లడించింది.టెండర్ పొందేందుకు అవసరమైన అర్హతలు ఈ కంపెనీకి లేవని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.

వేమూరి హరికృష్ణ ప్రసాద్ తో పాటు ఏపీకే ఇన్ఫ్స్ట్రాక్చర్ కార్పొరేషన్ అప్పటి ఎండీ సాంబశివరావు, టెరా సాప్ట్ వేర్ చైర్మన్ ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావు, ఎండీ టీ.గోపీచంద్, మరో ఐదు కంపెనీ డైరెక్టర్లు, హిమాచల్ ఫ్యూటరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, కొందరు అధికారుల పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి.ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.అవినీతిపై దర్యాప్తు జరిపించాలని సీఐడీ ఈడీకి శ్రీకాంత్ నాగులపల్లి జులై 11 ఉత్తర్వులు జారీ చేశారు.దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు అని సూచించారు.2020 జూలై 13న వీశ్వసనీయ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినప్పటికీ ఈ కేసును సిబీఐ ఆసక్తి కనబర్చలేదు.దీంతో అది రాష్ట్ర సీఐడీ కి వెళ్ళింది          

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube