అమెరికాలో భారతీయ ఎన్నారైల క్రిస్మస్ వేడుకలు...!!!

అమెరికాలో ఉన్న భారతీయుల సమాఖ్య లక్షల్లో ఉంటుంది.

వారిలో ఎంతో మంది వివిధ ప్రాంతాల వారు, వివిధ కులాల వారు ఉన్నా, అందరూ కలిసి ప్రతీ భారతీయ పండుగలు జరుపుకుంటూ భారతీయ ఐక్యతని ప్రపంచానికి చాటి చెప్తూ ఉంటారు.

అమెరికాలో ఉన్న భారతీయులకి ఎంటువంటి ఆపద జరిగినా సరే చిన్నపాటి కష్టం వచ్చినా అమెరికాలోని అన్ని భారతీయ సంఘాలు వెనువెంటనే స్పందిస్తాయి.ఈ క్రమంలోనే అమెరికాలోని యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆఫ్ వర్జీనియా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలని ఎన్నారైలు నిర్వహించుకున్నారు.

ఈ వేడుకలకి స్థానికంగా ఉన్న ఎన్నారైలు అందరూ హాజరయ్యారు.హాష్ బర్గ్ లోని లూథరన్ చర్చి లో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు.

ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అంతేకాదు తమ కుటుంభ సభ్యులతో కలిసి అందరిని అలరించారు.

Advertisement

ఈ క్రిస్మస్ సబరాలలో క్రిస్టియన్స్ తో పాటు వివిధ తెలుగు సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆట పాటలు, వివిధ కార్యక్రమాలు ఆహుతులని అలరించాయి.అందరూ కలిసి క్రిస్మస్ కేక్ ని కట్ చేశారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల భారతీయ వంటలని వడ్డించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు సంఘాలకి , భారతీయులకి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు