అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్‌తో చేతులు కలిపిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి సైరా తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే బిజీగ ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల చిరు లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో చిరు రెండు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తాడట.అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే తన నెక్ట్ మూవీని కూడా చిరు లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడట.

కాగా చిరు నెక్ట్స్ మూవీ కోసం దర్శకుడు వివి వినాయక్ ఓ అదిరిపోయే స్క్రిప్టును వినిపించాడట.ఈ స్క్రిప్టును విన్న చిరు కూడా వినాయక్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

అయితే ఈ సినిమా మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన ల్యూసిఫర్‌కు రీమేక్ అనే అంశం ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.కానీ ఇండస్ట్రీలో సినిమా ఆఫర్లే లేని వినాయక్‌తో మెగాస్టార్ సినిమా చేయడంతో ఆయన చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

గతంలో చిరంజీవికి ఖైదీ నెంబర్ 150 లాంటి సూపర్ సక్సెస్ అందించిన వినాయక్, ఆ తరువాత వరుసగా అట్టర్ ఫ్లాప్ సినిమాలతో డైరెక్టర్‌గా ఫేడవుట్ అయ్యాడు.మరి ఇప్పుడు వినాయక్‌తో చిరు సినిమా అంటే టాలీవుడ్‌లో ఈ కాంబోపై ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, ఎన్వీ ప్రసాద్‌ కలిసి నిర్మించనున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి సబ్జెక్టుతో తెరకెక్కుతుందో చూడాలి అంటున్నారు మెగా ఫ్యాన్స్.

Advertisement

తాజా వార్తలు