మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు చిరంజీవి రెడీ అయ్యాడు.
ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే, చిరంజీవి తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా అనౌన్స్ చేశారు.
ఇందులో అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్‌తో మెగాస్టార్ చేయబోయే భోళాశంకర్ చిత్రం కూడా ఒకటి.
ఈ సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ముఖ్యంగా మెహర్ రమేష్‌కు సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో, చిరు ఆయనకు ఎందుకు అవకాశం ఇచ్చాడా అనే చర్చ టాలీవుడ్‌లో జోరుగా సాగింది.
ఇక ఈ సినిమాకు భోళాశంకర్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసి, మెగాస్టార్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.కాగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా భోళాశంకర్ రానున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇటీవల ఆయన అన్ని సినిమాల్లో ఒకే గెటప్‌లో కనిపించడంతో ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశం ఉందని భావించిన చిరు, భోళాశంకర్ కోసం సరికొత్త లుక్‌ను ట్రై చేయబోతున్నాడట.
దీని కోసం ప్రత్యేకంగా ఓ స్టైలిస్ట్‌ను తెప్పించుకోనున్నాడట.మరి భోళా శంకర్ చిత్రంలో మెగాస్టార్‌ను ఎలాంటి గెటప్‌లో చూపిస్తాడో ఈ డైరెక్టర్ అని మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారట.
ఇక ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో అందాల భామ కీర్తి సురేష్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు అభిమానులు.