చిరంజీవి నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పాతాళ భైరవి మూవీ రీమేక్.. ఏం జరిగిందంటే?

గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో వినిపిస్తున్న పేరు నాగ్ అశ్విన్.

( Nag Ashwin ) కల్కి సినిమా( Kalki Movie ) ప్రమోషన్స్ నుంచి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు మారుమోగిపోతోంది.

ఆయన తాజాగా దర్శకత్వం వహించిన సినిమా కల్కి.ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ప్రతి ఒక్కరూ నాగ్ అశ్విన్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

అంతేకాకుండా ఈ సినిమాతో నాగ్‌ అశ్విన్‌ ఇప్పుడు ఇండియన్‌ టాప్‌ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు.రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌, అట్లీ, సిద్ధార్థ్‌ ఆనంద్‌, సందీప్‌ రెడ్డి వంగా వంటి టాప్‌ కలెక్టెడ్‌ డైరెక్టర్‌ కేటగిరిలో చేరిపోపోయారు.

ఆయన దర్శకత్వం వహించిన కల్కి సినిమా ఐదు రోజుల్లోనే ఈ సినిమా సుమారు ఆరు వందల కోట్ల గ్రాస్‌ సాధించడం విశేషం.ఈ మూవీ ఈజీగా వెయ్యి కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.సినిమా విడుదల అయ్యి దాదాపు వారం రోజులు కావస్తున్నా కూడా థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

Advertisement

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ సినిమాలకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.చిరంజీవితో( Chiranjeevi ) సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉండబోతోంది అనే వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి.

దీనికి సంబంధించిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.దీంతో ఈ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా అనే టాక్‌ ప్రారంభమైంది.కాగా చిరంజీవి గతంలో మహానటి( Mahanati ) సినిమా సమయంలో నాగ్‌ అశ్విన్‌ ని టీం ని గొప్పగా ప్రశంసిస్తూ అభినందించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చిరు తన మనసులోని మాటని బయటపెట్టాడు.తనకు ఫోక్‌ లోర్‌ సినిమాలు చేయాలని ఉందని అన్నారు చిరు.మాయలు, మంత్రాలు ఉండే చిత్రాలంటే తనకు ఇష్టం అని అలాంటి సినిమాలు చేయాలనుకున్నారట.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఈ విషయాన్ని నాగ్ అశ్విన్‌ కి తెలిపారు.నాగ్‌ ఇలాంటి కథ రెడీ చేస్తే సినిమా చేసేందుకు రెడీ అన్నట్టుగా తెలిపారు చిరు.

Advertisement

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజా వార్తలు