రేణు దేశాయ్( Renu Desai ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఈమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన ఎన్నో పోస్టులను అభిమానులతో పంచుకుంటున్నారు.
పవన్ విజయం తర్వాత తన ఇద్దరు పిల్లలు కూడా తన తండ్రి వెంటే ఉంటూ ఎంతోమంది రాజకీయ ప్రముఖులను కలవడం పట్ల రేణు దేశాయ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
ఇలా ఈమె తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఎంతోమంది ఈమె చేసే పోస్టులపై నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేశారు.దీంతో ఎంతో ఆవేదన చెందిన ఈమె తాను ఫేస్ బుక్, ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నానని ఈ సందర్భంగా రేణు దేశాయ్ తెలియజేశారు.కేవలం తాను చేసే కొన్ని సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది నా మంచి కోరే వారి సలహా మేరకు ఇంస్టాగ్రామ్ ( Instagram ) మాత్రమే ఫాలో అవుతున్నానని తెలిపారు.
ఇలా ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ మరోసారి ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక పోస్ట్ చేశారు.మనుషులు కేవలం వారి ఆనందం కోసం పక్షులను మూగజీవాలను( Animals ) ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.కొన్ని క్షణాల ఆనందం కోసం మూగజీవాలను చంపేస్తున్నారని టార్చర్ చేస్తున్నారంటూ ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక ఈమె తన సంపాదనలో ప్రతినెల మూగజీవాల సంరక్షణ కోసం కొంత మొత్తంలో డబ్బును డొనేట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.