తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.
స్టార్ హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ ఇటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ దూసుకు పోతుంది.
లేడీ సూపర్ స్టార్ గా అభిమానుల చేత పిలుపించుకుంటూ స్టార్ హీరోలకే పోటీగా నిలుస్తుంది.
ఇక ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి పీటలు కూడా ఎక్కిన విషయం విదితమే.ఇక ఇదిలా ఉండగా ఈమె తాజాగా తెలుగులో నటించిన సినిమా గాడ్ ఫాదర్.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాను తమిళ్ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేసాడు.ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.
సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు.
అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, అనసూయ, సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.పండుగ వేళ రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్ పండుగ సినిమా అనిపించుకుంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా సాగిపోతున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు.
ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తర్వాత వచ్చి చిరు దానిని మరిపించే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఈ సక్సెస్ తో నయనతార కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది.
ఈ క్రమంలోనే ఒక లేఖ రిలీజ్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం చేసిన అందరికి ధన్యవాదములు.మీరందరు మా సినిమాను మీ ప్రియమైన వారితో థియేటర్ లో చూడడం ఆనందంగా ఉంది.గాడ్ ఫాదర్ నాకు స్పెషల్ చిత్రం.మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడం సంతోషంగా ఉంది.ఆయన ఒక జెమ్.
ఆయన పవర్ హౌస్ పెర్ఫార్మర్.సెట్ లో ఉన్న ప్రతి క్షణం ఆనందించాను.
అందుకే ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు.అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించింది.