హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదైంది.సెప్టెంబర్ 26తో హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ గడువు ముగిసింది.
అయితే గడువు ముగిసినా తప్పుడు పత్రాలు క్రియేట్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో బీసీసీఐ, ఈసీ కమిటీని అజారుద్దీన్ తప్పుదోవ పట్టించారని హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్, సెక్రటరీ శేషులు ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా గడువు పొడిగింపు ఉత్తర్వులు ఆయనే ఇచ్చుకున్నారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.ఈ సందర్భంగా అజార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.







