పెళ్లికి ముందు చిరంజీవి గురించి సురేఖ అలా అనుకున్నారా.. బోర్లా పడ్డానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన విజయాలను సొంతం చేసుకుని మెగాస్టార్ చిరంజీవి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.రీఎంట్రీలో కూడా చిరంజీవి సినిమాలకు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు.

ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘనవిజయం సాధించాయి.ఆచార్య సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటానని చిరంజీవి నమ్ముతుండగా ఆ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి.

ఆచార్య థియేటర్లలో విడుదల కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.అయితే ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లికి సంబంధించి చిరంజీవి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

సురేఖ పెళ్లికి ముందు మనవూరి పాండవులు సినిమా చూసి ఈ సినిమాలో సైకిల్ అబ్బాయి చాలా బాగున్నాడని తన గురించి అనుకుందని చిరంజీవి వెల్లడించారు.అక్కడితో ఫినిష్ అని తాను బొక్కా బోర్లా పడ్డానని చిరంజీవి పేర్కొన్నారు.

Advertisement

ఆ సమయంలో తాను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నా పెళ్లి జరిగిపోయిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.సిద్ధ పాత్ర నచ్చడం వల్లే రామ్ చరణ్ ఆచార్య సినిమాలో నటించడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.

ఆచార్య సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రిజల్ట్ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆచార్య సినిమా సక్సెస్ ను బట్టి చిరంజీవి తర్వాత సినిమాలకు బిజినెస్ జరగనుంది.ఈ సినిమా కలెక్షన్ల ఎఫెక్ట్ చిరంజీవి తర్వాత సినిమాలపై పడనుంది.ఈ సినిమాతో కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాల్సిన బాధ్యత చిరంజీవి, చరణ్ లపై ఉంది.

ఆర్ఆర్ఆర్ థియేటర్లలో ఉన్న సమయంలోనే ఆచార్య విడుదలవుతూ ఉండటం గమనార్హం.ఆచార్య సక్సెస్ సాధించాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు