మెగా స్టార్‌ వచ్చేది ఎప్పుడు.. గాడ్‌ ఫాదర్‌ లో దిగేది ఎప్పుడు?

మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల అయిన వెంటనే భార్య సురేఖ గారితో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెల్సిందే.

అమెరికా వెళ్లిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా చిరంజీవి తెలియజేశాడు.

వెళ్లిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడు.ఎవరిని మీట్‌ అవుతున్నాడు అనే విషయాలను గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

దాంతో ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు.చిరంజీవి వెయిట్‌ లాస్ అవ్వడం కోసం అమెరికా వెళ్లాడు అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఆయన విశ్రాంతి కోసమే వెళ్లాడు అంటున్నారు.

ఆయన వెళ్లిన సమయంలోనే ఆచార్య బయ్యర్లు ఆందోళన చేస్తున్నారు.పదుల కోట్ల లో మేము నష్టపోతే చిరంజీవి అలా విహార యాత్రలకు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ఈ విషయంలో వారిని కొందరు విమర్శిస్తున్నారు.ఆ విషయం పక్కన పెడితే చిరంజీవి ఎప్పుడు వస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.

చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమా షూటింగ్‌ ను ముగించాల్సి ఉంది.ఆయన షూటింగ్‌ ను ముగిస్తే సినిమా ను వచ్చే ఆగస్టు లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

గాడ్‌ ఫాదర్‌ సినిమా కోసం చిరంజీవి ఇంకా వారం నుండి పది రోజుల డేట్లు కేటాయిస్తే సరిపోతుంది.అందుకోసం చిరంజీవి రెడీగా ఉన్నాడు అనేది టాక్‌.

ఇక చిరంజీవి అమెరికా నుండి మరో వారం పది రోజుల్లో వస్తాడనే టాక్‌ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం జూన్‌ వరకు అక్కడే చిరు దంపతులు ఉంటారనే టాక్‌ ఉంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

మొత్తానికి చిరంజీవి మరియు సురేఖ లు ఎప్పుడెప్పుడు ఇండియా లో ల్యాండ్‌ అవుతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ ను మాత్రమే కాకుండా భోళా శంకర్ మరియు వాల్తేరు వీరన్న సినిమా లను కూడా అలా మొదలు పెట్టి ఉంచాడు.

Advertisement

వాటిని కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేయాల్సి ఉంది.

తాజా వార్తలు