ఎఫ్ 3 సినిమా కంటే దారుణంగా చిరంజీవి గాడ్ ఫాదర్ కలెక్షన్స్.. కారణం?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.

మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.చిరంజీవి ఈ వయసులో కూడా అదే సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార, నటుడు సత్యదేవ్ కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ విషయం తెలిసిందే.మోహన్ రాజా చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా నైజాంలో రూ.22 కోట్లు, సీడెడ్‌లో రూ.13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ.35 కోట్ల మేర బిజినెస్ జరిగింది.ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ.70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది.అలాగే, కర్నాకటతో రూ.6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.7.50 కోట్లతో కలిపి రూ.91 కోట్ల బిజినెస్ అయింది.

అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన గాడ్ ఫాదర్ సినిమా అనుకున్న విధంగానే,ప్రపంచ వ్యాప్తంగా రూ.91 కోట్లు మేర బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే.దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అయి 92 కోట్లు నమోదు అయ్యింది.

Advertisement

ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ సినిమా ఐదవ రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి.దీంతో కోటి కంటే తక్కువ మొత్తంలో కలెక్షన్లు వచ్చాయి.అంతేకాకుండా ఎక్కువ రోజులు కోటి రూపాయల కలెక్షన్స్ సాధించిన సినిమాలో గాడ్ ఫాదర్ సినిమా నిలిచిందీ.

కాగా వరుణ్ తేజ్ వెంకటేష్ కలిసిన నటించిన ఎఫ్3 సినిమా ఈ ఫీట్  కేవలం ఏడు రోజుల్లోనే సాధించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు