మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమా లతో బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.సినిమా ల విషయం లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
సినిమా లకు సంబంధించిన వరకు ఆయన నిర్ణయాలు అన్ని కూడా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి అనడంలో సందేహం లేదు.ఆచార్య సినిమా ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
మరో వైపు ఆయన గాడ్ ఫాదర్ సినిమా ను ఆగస్టు లో విడుదల చేయబోతున్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ అయ్యింది.మోహన్ రాజా దర్శకత్వం లో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమా విడుదల విషయంలో త్వరలో నే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదే సమయంలో హీరోగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా కూడా విడుదలకు సిద్దం అవుతుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ లో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
డిసెంబర్ లో సినిమా విడుదల అవ్వబోతున్న భోళా శంకర్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.భోళా శంకర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
షూటింగ్ త్వరలోనే పూర్తి అవ్వబోతుందని.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా తెలుస్తోంది.

భోళా శంకర్ సినిమా విడుదల తేదీ విషయంలో ఒకటి రెండు వారాల్లోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.భోళా శంకర్ లో చిరంజీవి కి చెల్లి పాత్ర లో కీర్తి సురేష్ నటించబోతున్న విషయం తెల్సిందే.హీరోయిన్ గా సినిమా లో తమన్నా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి సినిమా లు మరి కొన్ని కూడా ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి.కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.మొత్తానికి ఈ ఏడాది మూడు సినిమా లు వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.