రాజశేఖర్‌ కోసం చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు

యాంగ్రీయంగ్‌ మన్‌ రాజశేఖర్‌ కరోనాతో పోరాడుతున్న విషయం తెల్సిందే.

ఆయన కుటుంబంలోని మొత్తం నలుగురు కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వగా మొదట ఇద్దరు కూతుర్లు కరోనా నుండి బయట పడ్డారు.

కాస్త ఆలస్యంగా అయినా జీవిత కూడా కరోనాను జయించింది.కాని రాజశేఖర్‌ మాత్రం కరోనాతో ఇంకా పోరాటం చేస్తున్నారు.

ప్రస్తుతం రాజశేఖర్‌కు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.రాజశేఖర్‌ హెల్త్‌ బులిటెన్‌ ప్రస్తుతం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది.

రాజశేఖర్‌ త్వరగా కోలుకుని బయటకు వచ్చేయాలంటూ అందరు ప్రార్థిస్తున్నారు.ఆయన కుటుంబ సభ్యులు చిగురుటాకు మాదిరిగా వణికి పోతున్నారు.

Advertisement

ఈ విషయంలో వారి ఆందోళనను చిరంజీవి గుర్తించినట్లుగా ఉన్నారు.చిరంజీవి కుటుంబంతో అపోలో యాజమాన్యంకు బంధుత్వం ఉంది.

చిరు కోడలు అయిన ఉపాసన వాళ్లదే అపోలో.అందుకే చిరంజీవి అత్యున్నత వైధ్య బృందంను రాజశేఖర్‌ కోసం ఏర్పాటు చేయాల్సిందిగా అపోలో వారిని చిరంజీవి కోరాడట.

ప్రస్తుతం వారు రాజశేఖర్‌ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని సినీ వర్గాల వారి ద్వారా తెలుస్తోంది.కరోనా రోగులను ఎంతో మందిని కాపాడిన వారు ఇప్పుడు రాజశేఖర్‌ ను ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజశేఖర్‌ మరియు చిరంజీవిల మద్య గతంలో విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినా ఆ తర్వాత తర్వాత కాలంలో అవి కనుమరుగు అయ్యాయి.ఇద్దరు కూడా కలిసి ఈమద్య కాలంలో చాలా వేదికలపై మాట్లాడుకున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆ అనుబంధంతోనే రాజశేఖర్‌ను సేవ్‌ చేసేందుకు గాను చిరంజీవి ప్రత్యేక వైధ్య బృందంను ఏర్పాటు చేయడం జరిగింది.అతి త్వరలోనే రాజశేఖర్‌ పూర్తి ఆరోగ్యంగా ఆసుపత్రి నుండి బయటకు వచ్చేస్తాడు అంటూ ఆయన అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

ఆయన త్వరగా కోలుకోవాలని మనమూ కోరుకుందాం.

తాజా వార్తలు