Waltair Veerayya Chiranjeevi : వాల్తేరు వీరయ్య నుండి నెక్ట్స్ రాబోతున్నది ఎంటో తెలిస్తే మాస్ జాతరే

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుండి బాస్ పార్టీ పాట తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

బాబి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా లో మాస్ మహారాజా రవితేజ కీలకమైన పాత్ర లో నటిస్తున్న విషయం కూడా తెలిసిందే.

ఈ సినిమా లోని రవితేజ పాత్ర కి ఒక పాట కూడా ఉంటుందని.ఆ పాటలో చిరంజీవి మరియు రవితేజ కలిసి డాన్స్ చేశారని సమాచారం అందుతోంది.

వీరిద్దరి కాంబినేషన్ లో పాట ఎప్పుడెప్పుడు చూస్తామా.వింటామా అంటూ మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వారి ఎదురు చూపులకు తెరపడబోతోంది.బాస్ పార్టీ పాట వచ్చి అందరిని అలరించిన తర్వాత ఇప్పుడు వెంటనే చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్ లో చిత్రీకరించిన పాట ను విడుదల చేయాలని దేవి శ్రీ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నాడట.

Advertisement

అందుకు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ కూడా మెగాస్టార్ చిరంజీవి నుండి రావడంతో దర్శకుడు మరియు సంగీత దర్శకుడు ఆ పనిలోనే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.ఒకటి రెండు వారాల్లోనే ఆ పాట ను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆ పాట కచ్చితం గా మాస్ జాతర అన్నట్లుగా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి దేవి శ్రీ ప్రసాద్ టీం హామీ ఇస్తోంది.అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా యొక్క అన్ని పాటలు కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

 ఈ సినిమా లో చిరు కు జోడీగా శృతి హాసన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు