అన్ని నవరసాలతో కూడిన సన్నివేశాలను కలిపితేనే ఒక సినిమా అవుతుంది.కొన్ని కొన్ని సార్లు మంచి కంటెంట్ ఉన్న కూడా సినిమాలు అంతగా విజయాన్ని అందుకోలేకపోతాయి.
ఎందుకంటే అందులో ప్రధాన పాత్రలో నటించే నటులు ఒక కారణం అని చెప్పవచ్చు.అంతేకాకుండా ఆ సినిమాను దర్శకుడు ప్రేక్షకులను మెప్పించే విధంగా చూపించలేకపోవడంతోనో అని కూడా చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే చిరంజీవి, మోహన్ బాబులు కూడా ఓ జోనర్ కు చెందిన సినిమాలలో మెప్పించలేకపోయారు.
అదేంటి స్టార్ హీరోలైన చిరంజీవి, మోహన్ బాబు లు మెప్పించలేకపోయినా సినిమా ఏంటి అని అనుకుంటున్నారా.
అసలు సంగతేంటంటే చిరంజీవి, మోహన్ బాబులకు ఎక్కువగా నవ్వులు పూయించే సినిమాలు కలిసి రాలేవని.పైగా ఆ జోనర్ కు చెందిన సినిమాలలో నటించిన కూడా వాళ్లు మెప్పించలేకపోయారని తెలిసింది.
గతంలో జంధ్యాల దర్శకత్వంలో చంటబ్బాయ్ సినిమాలో నటించాడు చిరంజీవి.
ఈ సినిమాలో చిరంజీవి డిటెక్టివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా నవ్వించాడు.

కానీ ఈ సినిమా అంతగా విజయాన్ని అందుకోలేకపోయింది.ఇక మోహన్ బాబు వంశీ దర్శకత్వంలో డిటెక్టివ్ నారద సినిమాలో నటించగా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.కానీ ఈ సినిమా కూడా మోహన్ బాబును నిరాశపరిచింది.దీంతో ఇద్దరు స్టార్ హీరోలు డిటెక్టివ్ కథలో కామెడీ పరంగా నటించడంతో సీరియస్ పాత్రలో కామెడీ పాత్రలు ఏంటి అని విమర్శలు చేశారు ప్రేక్షకులు.

దీంతో ఈ స్టార్ హీరోలు ఇద్దరు ఈ సినిమాలతో నిరాశ చెందగా.ఇక అప్పటి నుండి ఇటువంటి పాత్రల్లో నటించడానికి వీరిద్దరూ ఆసక్తి చూపలేదు.అంతేకాకుండా ఆ స్టార్ దర్శకులు కూడా ఇటువంటి జోనర్ లో మరే సినిమాలు కూడా చేయలేదు.మొత్తానికి చిరంజీవి, మోహన్ బాబులకు ఈ జోనర్ సినిమా అచ్చి రాలేదని అర్థమయింది.