ఎన్నికల ప్రచారంలో దివంగత హీరో కృష్ణపై చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..!!

దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) దివంగత సూపర్ స్టార్ కృష్ణపై( Superstar Krishna ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పెదపాడు మండలం కొత్తూరులో బీజేపీ.టీడీపీ… జనసేన పార్టీలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.

 Chintamaneni Prabhakar Sensational Comments About Late Hero Krishna Details, Td-TeluguStop.com

సినీనటుడు హీరో కృష్ణ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నుండి ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది.దీంతో ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ ను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇదే కార్యక్రమంలో గన్ని వీరాంజనేయులు, రెడ్డి అప్పలనాయుడు, రాఘవయ్య చౌదరి మాట్లాడటం జరిగింది.పుట్ట మహేష్( Putta Mahesh ) కడప జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో… ప్రత్యర్థులు నాన్ లోకల్ అని కామెంట్లు చేస్తున్నారు.దీంతో గతంలో దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు( Eluru ) నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచినట్లు గుర్తు చేశారు.కాబట్టి ప్రజలందరూ పుట్టా మహేష్ నీ గెలిపించాలని చింతమనేని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

ఏపీలో ఎన్నికలకు ఇంకా నెలరోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో చింతమనేని ప్రభాకర్ భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు.2009, 2014 ఎన్నికలలో చింతమనేని గెలిచారు.కానీ 2019 ఎన్నికలలో ఓటమి పాలు అయ్యారు.

ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాలని తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube