వైరల్‌ : 17 ఏళ్ల పాటు అడవిలో ఒంటరి జీవితం, అతడు మాట్లాడటం కూడా మర్చిపోయాడు

చైనాలో 2002వ సంవత్సరంలో సాంగ్‌ జియాంగ్‌ అనే ఒక వ్యక్తి పిల్లలను మరియు మహిళలను అక్రమంగా తరలించే కేసులో పట్టుబడ్డాడు.

అతడికి కఠిన శిక్ష తప్పదని అంతా భావించారు.

కేసు విచారణ జరుపుతున్న సమయంలో అతడు పోలీసుల అదుపు నుండి తప్పించుకున్నాడు.అతడి కోసం పోలీసులు చుట్టు పక్కల మొత్తం జల్లెడ పట్టారు.

మొత్తం చైనాలో అతడి కోసం అన్వేషించారు.కాని అతడి ఆచూకి మాత్రం ఎక్కడ లభించలేదు.

చివరకు అతడు చనిపోయి ఉంటాడని పోలీసులు వర్గాల వారు భావించారు.

Advertisement

  సాంగ్‌ జియాంగ్‌ పోలీసుల నుండి తప్పించుకున్న తర్వాత జనావాసాల్లోకి వెళ్తే పోలీసులు మళ్లీ పట్టుకోవడం ఖాయం అనుకున్నాడు.అందుకే కొన్నాళ్ల పాటు అడవిలో జీవనం సాగించాలని భావించాడు.అందుకోసం అడవిలోని ఒక గుహలో తల దాచుకోవడం ప్రారంభించాడు.

కొన్నాళ్లు కాస్త అలా అలా ఏకంగా 17 ఏళ్ల పాటు ఆ గుహలోనే సాంగ్‌ జియాంగ్‌ తల దాచుకున్నాడు.ఇప్పటికి కూడా అతడు బయటకు రాలేదు.పోలీసులు అతడిని బయటకు తీసుకు వచ్చారు.

అడవిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సంచరిస్తున్నట్లుగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు.అయినా కూడా ఫలితం లేకుండా పోయింది.

రెండు మూడు రోజుల పాటు తీవ్రంగా అడవినంతా గాలించారు.అయినా కూడా ఎవరి జాడా కనిపించక పోవడంతో చివరి ప్రయత్నంగా డ్రోన్‌ కెమెరాలతో అడవిని జల్లెడ పట్టారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అప్పుడు ఒక దట్టమైన ప్రదేశంలోని గుహ వద్ద ఒక మనిషి ఉన్నట్లుగా గుర్తించారు.ఆ మనిషి ఎవరై ఉంటారా అనుకున్నారు.

Advertisement

మొదట అడవి మనిషి అయ్యి ఉంటాడేమో అంటూ ప్రచారం జరిగింది.

  పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుని ఆ గుహ వద్దకు చేరుకున్నారు.అక్కడకు వెళ్లిన తర్వాత ఒక మనిషిని పోలీసులు గుర్తించారు.అక్కడ ఒక వ్యక్తి లభించాడంటూ పోలీసులు సమాచారం అందించారు.

వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు.చివరకు అతడు సాంగ్‌ జియాంగ్‌ అని గుర్తించారు.జైలు శిక్షను తప్పించుకునేందుకు అతడు ఇలా దాక్కున్నాడని గుర్తించారు.17 ఏళ్ల పాటు ఎవరితో మాట్లాడకుండా ఉండటంతో పాటు, అడవిలో ఉండటం వల్ల సాంగ్‌ జియాంగ్‌ మాట్లాడటం మర్చి పోవడంతో పాటు, మానసికంగా కూడా సరిగా లేడని పోలీసులు గుర్తించారు.అతడి వద్ద ఉన్న ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో మంచి నీరు తెచ్చుకుని, పండ్లు మరియు కాయలను తింటూ జీవనం సాగించాడని పోలీసులు గుర్తించారు.

అతడు ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నాడు.త్వరలోనే అతడి తిరిగి మామూలు మనిషి అయ్యే అవకాశం ఉందని వైధ్యులు అంటున్నారు.పోలీసులు అతడు క్యూర్‌ అవ్వగానే అరెస్ట్‌ చేయాలనుకుంటున్నారు.

తాజా వార్తలు