వామ్మో: సినిమా చూసే సమయంలో రైలు 1000 కి.మీ. ప్రయాణం..!

ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది.చాలా మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.

ఇంకొందరు అనాధలుగా మారారు.ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది.

ప్రపంచ దేశాలన్నీ ఇలా ఉంటే చైనా మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.చైనా నూతన టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది.

పోటీ ప్రపంచంలో రోజురోజుకూ ఓ కొత్త ఆవిష్కరణ చేస్తూ తన బలాన్ని పెంచుకుంటోంది.తాజాగా చైనా ఓ గొప్ప ఆవిష్కరణ చేసింది.

Advertisement

తమ స్వదేశ పరిజ్షానంతో నడిచేటటువంటి మాగ్లెవ్ టెక్నాలజీ రైలును చైనా కనుగొంది.ఈ రైలు అయస్కాంత శక్తితో నడుస్తుంది.

మాగ్లెవ్ రైలు పట్టాలను తాకకుండా గాల్లో తెలుతూ వెళ్తుంది.ఇంకా చెప్పాలంటే ఈ రైలు మెరుపు వేగంతో పరుగులు పెడుతుంది.

ఈ రైలు కేవంలో ఓ గంటకు 620 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది.

ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించగలిగే వాహనం ఇదేనని చైనా దేశం గర్వంగా చెప్పుకుంది.రెండు దశబ్ధాలుగా ఇటువంటి ట్రైన్ ను ఏర్పాటు చేయడానికి ప్రయోగాలు అనేవి సాగుతున్నాయి.మాగ్లెవ్ రైళ్ళపై చైనా ప్రయోగాలు చేసి తన సత్తా చాటింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ రైళ్లు తేలికగా ఉంటాయి.మాగ్లెవ్ రైళ్ళను వాటికంటే ఎక్కువ వేగంతో వెళ్లేటటువంటి కొత్త మాగ్లేవ్ రైలును చైనా ఏర్పాటు చేసింది.

Advertisement

అది కనుక ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లైతే గంటల వ్యవధిలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.చైనా దేశంలో మనం చూసినట్లైతే ప్రధాన నగరాలైనటువంటి బీజింగ్ నుండి షాంఘైకు వెయ్యి కిలోమీటర్ల దూరం వరకూ ఉంటుంది.

ఇటువంటి దూరాన్ని కూడా కేవలం రెండున్నర గంటల్లో మాగ్లెవ్ రైలు ప్రయాణిస్తుంది.ఇదే ప్రయాణం అయితే విమానంలో 3 గంటల వరకూ సమయం పడుతుంది.

ఇటువంటి రైళ్లను ఏర్పాటు చేయడం ఎంతో శుభపరిణామమని చైనా ప్రపంచానికి ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేసింది.

తాజా వార్తలు