అలాంటి వారికి హనుమాన్ మూవీ చెంపదెబ్బ.. చిలుకూరు ప్రధాన అర్చకుల కామెంట్స్ వైరల్!

2024 సంవత్సరంలో ఇప్పటివరకు రిలీజైన సినిమాలలో అత్యంత ఆకట్టుకున్న సినిమా ఏదనే ప్రశ్నకు హనుమాన్ సినిమా( Hanuman movie ) పేరును సమాధానంగా చెబుతారు.

ఈ సినిమా ప్రేక్షకులను ఊహించని స్థాయిలో ఆకట్టుకోవడంతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఎంతగానో నచ్చేసింది.

తాజాగా చిలుకూరు ప్రధాన అర్చకులు హనుమాన్ సినిమా గురించి మాట్లాడుతూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్( Rangarajan ) మాట్లాడుతూ తన పేరును జపిస్తే బుద్ధి, బలం, ధైర్యం, నిర్భయత్వాన్ని హనుమంతుడు ప్రస్తాదిస్తాడని ప్రేక్షకులు హనుమంతుని నామస్మరణ చేసేలా చేసిన చిత్రబృందానికి కృతజ్ఞతలు అని ఆయన చెప్పుకొచ్చారు.

అర్చకులు రెండు రకాల పాత్రలు పోషిస్తారని భక్తుల ప్రతినిధిగా గర్భగుడిలోకి వెళ్తారని స్వామివారి ప్రతినిధిగా బయటకు వస్తారని ఆయన పేర్కొన్నారు.

యంగ్ టీమ్ తెరకెక్కించినా హనుమాన్ సినిమాతో అద్భుతం చేసిందని హనుమాన్ మూవీ చూసి నాకు మాటలు రాలేదని ఆయన కామెంట్లు చేశారు. ప్రశాంత్( Prashanth ) సోదరి హనుమాన్ మూవీ కథ విషయంలో చక్కగా శోధన చేశారని ప్రస్తుత రోజుల్లో సినిమా అనేది కీలక మాధ్యమమని రంగరాజన్ చెప్పుకొచ్చారు.సమాజానికి విలువైన చిత్రాలను అందించాలని హనుమాన్ లో ఎక్కడా అసభ్యత కనిపించదని రంగరాజన్ వెల్లడించారు.

Advertisement

బాల్యం నుంచి నేను ఏం చేసినా ప్రోత్సహించిన తల్లీదండ్రులకు కృతజ్ఞతలని నిర్మాత నిరంజన్ రెడ్డి ( Produced Niranjan Reddy )సపోర్ట్ గా నిలిచారని ప్రశాంత్ వర్మ తెలిపారు.తేజ గొప్ప నటుడని ఎమోషనల్ సీన్స్ లో జీవిస్తాడని ఆయన తెలిపారు.రవితేజ అంగీకరిస్తే ఆయనతో ఒక సినిమా తీయాలని ఫీలవుతున్నానని ప్రశాంత్ వర్మ అన్నారు.

రాబోయే రోజుల్లో రవితేజ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కడం ఖాయమని తేలిపోయింది.ఈ కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు