మీ పిల్లలు వయసు పెరుగుతున్నా బరువు పెరగడం లేదా.. అయితే ఇలా చేయండి!

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు( overweight ) బాధితులే కాకుండా తక్కువ బరువుతో బాధపడుతున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు.

ముఖ్యంగా చాలా మంది పిల్లలు వయసు పెరుగుతున్నా బరువు మాత్రం పెరగరు.

వయసుకు తగ్గ బరువు లేకపోవడం వల్ల పిల్లలు చాలా బలహీనంగా ఉంటారు.చూడటానికి ఏమాత్రం ఆకర్షణీయంగా కనిపించరు.

ఈ క్రమంలోనే తమ పిల్లల బరువు విషయంలో తల్లిదండ్రులు హైరానా పడిపోతుంటారు.కానీ వర్రీ వద్దు.

నిజానికి కొన్ని కొన్ని ఆహారాలు ఆరోగ్యంగా శరీర బరువు పెర‌గ‌డానికి అద్భుతంగా తోడ్పడతాయి.ఇప్పుడు చెప్పబోయే స్మూతీ( Smoothie ) కూడా ఆ కోవ‌కే చెందుతుంది.

Children Gain Healthy Weight By Consuming This Smoothie Smoothie, Weight Gain S
Advertisement
Children Gain Healthy Weight By Consuming This Smoothie! Smoothie, Weight Gain S

మీ పిల్లల డైట్ లో ఈ స్మూతీని కనుక చేర్చారంటే నెల రోజుల్లో మీరు రిజల్ట్ ను గమనిస్తారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెల్తీ వెయిట్ గెయిన్ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక అరటి పండు( Banana ) తీసుకుని తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక అవకాడో( Avocado ) ని కట్ చేసి పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్, అవకాడో పల్ప్, వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్( Peanut butter ), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు ( milk )మరియు రెండు లేదా మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా బ్లెండ్‌ చేసుకోవాలి.

Children Gain Healthy Weight By Consuming This Smoothie Smoothie, Weight Gain S

మూడు నాలుగు నిమిషాల పాటు గ్రైండ్ చేస్తే మన స్మూతీ అనేది రెడీ అవుతుంది.ఈ అవకాడో బనానా స్మూతీ చాలా టేస్టీగా ఉంటుంది.మరియు అనేక ర‌కాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ తో సహా ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది.

పిల్లల రెగ్యులర్ డైట్ లో ఈ స్మూతీని కనుక చేర్చారంటే వారు చాలా హెల్తీగా బరువు పెరుగుతారు.అరటిపండు, అవకాడో, పాలు, పెరుగు, ఖర్జూరం, పీనట్ బటర్ ఇవన్నీ కండరాల నిర్మాణానికి ఉత్త‌మంగా తోడ్పడతాయి.

దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

శరీర బరువును చక్కగా పెంచుతాయి.కాబట్టి తక్కువ బరువు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ అవకాడో బనానా స్మూతీని డైట్ లో చేర్చుకోండి.

Advertisement

తాజా వార్తలు