జుట్టు విపరీతంగా రాలిపోతుందా.? ఒత్తైన మీ కురులు రోజు రోజుకు పల్చగా మారుతున్నాయా.? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగడం లేదా.? హెయిర్ ఫాల్( Hair fall ) తో బాగా విసిగిపోయారా.? డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ ను ప్రయత్నిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే.
ఈ హెయిర్ ప్యాక్ అత్యంత వేగంగా జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.అదే సమయంలో మరెన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరటి పండు( Banana )ను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.అలాగే ఐదు నుంచి ఆరు నైట్ అంతా వాటర్ లో నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పు( Soaked Almonds ), ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు వేసుకోవాలి.ఆపై అర కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు( Coconut Milk ) మరియు అర కప్పు బియ్యం కడిగిన నీరు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటించడం వల్ల అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా ఈ రెమెడీ జుట్టు రాలడాన్ని వేగంగా అరికడుతుంది.

అరటిపండు, బాదం పప్పు, గులాబీ రేకులు, కొబ్బరి పాలు మరియు రైస్ వాటర్ లో ఉండే పోషకాలు కురులను ఆరోగ్యంగా దృఢంగా మారుస్తాయి.జుట్టును మూలాల నుంచి బలోపేతం చేసి హెయిర్ ఫాల్ ను అడ్డుకుంటాయి.అలాగే ఈ రెమెడీ డ్రై హెయిర్ ను రిపేర్ చేస్తుంది.జుట్టును సిల్కీగా షైనీ గా మెరిపిస్తుంది.కాబట్టి హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టాలనుకుంటే ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని తప్పక ప్రయత్నించండి.