Perfume Movie Review: పర్ ఫ్యూమ్ రివ్వూ అండ్ రేటింగ్!

ప్రతి శుక్రవారం ఎన్నో సరికొత్త కథాంశంతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి.

అయితే స్మైల్ బెస్ట్ త్రిల్లింగ్ అనే సరికొత్త కాన్సెప్ట్ ద్వారా సినిమాలు రావడం చాలా అరుదు ఇలాంటి సినిమాలు చేయడం అంటే కూడా కాస్త కష్టతరమే అని చెప్పాలి ఇలా సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం పర్ ఫ్యూమ్(Perfume Movie).

జేడీ స్వామి (JD Swamy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చేనాగ్ (Chenag) ప్రాచీథాకర్(Prachi Thaker) జంటగా నటించారు.శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరి ఈ సినిమా ద్వారా నటినటులు ప్రేక్షకులను మెప్పించారా అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.

కథ:

నగరంలో స్మెల్ అబ్‌సెషన్ వ్యాధితో బాధపడే సైకో వ్యాస్ (చేనాగ్) తిరుగుతుంటాడు.ఇతనికి అమ్మాయిల వాసన తగిలితే చాలు అదోరకంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఇలా తరచూ అమ్మాయిలను వాసన చూస్తూ వారిని ఎంతో ఇబ్బంది పెడుతుంటారు.అయితే నగరంలో ఇలాంటి కేసులు అధికంగా నమోదు కావడంతో వెంటనే ఆ సైకోని పట్టుకోవాలని లేకపోతే చాలా ప్రమాదకరంగా మారుతారని ఏసీబీ దీప్తి (అభినయ)( Abhinaya ) భావిస్తుంది.

Advertisement

ఇదే సమయంలోనే వ్యాస్ కోసం లీల (ప్రాచీథాకర్) వెతుకుతూ ఉంటుంది.అయితే లీలాకు వ్యాస్( Vyas ) కనిపించడంతో ఆమె ముద్దు పెడుతుంది.

దీంతో పెళ్లి ఇలా మైకంలో ఉండిపోతాడు వ్యాస్ ఇక ఆమె కనిపించడంతో అందరి ముందు తనకు ముద్దు పెట్టగా ఆమె అందరి ముందు తనని అవమాన పరుస్తుంది దీంతో కోపంలో ఉన్నటువంటి వ్యాస్ లీలాని కిడ్నాప్ చేస్తాడు.ఇలా తనని కిడ్నాప్ చేసిన తర్వాత వ్యాస లీల అని ఏం చేశాడు? అసలు వ్యాస లీల( Leela ) బ్యాక్ గ్రౌండ్ ఏంటి పోలీసులకు ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు చివరికి ఏమైంది అనేది ఈ సినిమా కథ.

నటీనటుల నటన:

హీరో చేనాగ్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడ కూడా మొదటిసారి సినిమాలలో నటిస్తున్నారు అనే భావన కనపడకుండా ఎంతో అద్భుతంగా నటించారు.కొన్ని ఎమోషన్స్ సీన్స్( Emotion Scenes ) అలాగే యాక్షన్స్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించారని చెప్పాలి.ఇక ప్రాచీ సైతం తన పాత్రలో ఇమిడిపోయి నటించారు.

మిగిలిన చిత్ర బృందం కూడా ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి.

టెక్నికల్:

డైరెక్టర్ స్క్రీన్ ప్లే ఎంతో అద్భుతంగా చూపించారు.ఇక డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ప్రధాని మోదీతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు..!!

పాటలు( Songs ) కూడా పర్వాలేదు అనిపించాయి.సినిమా చూస్తుంటే నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.

Advertisement

ఇక కెమెరామెన్ వర్క్ కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి.

విశ్లేషణ:

సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పించడం అంటే సర్వసాధారణమైన విషయం కాదు కానీ ఈ విషయంలో డైరెక్టర్ మాత్రం సక్సెస్ అయ్యారు అని చెప్పాలి.ఈ సినిమాలో హీరో బాధను ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఫీలయ్యే విధంగా డైరెక్టర్ చూపించారు.ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ రాకుండా సినిమాని కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ప్లస్ పాయింట్స్:

హీరో నటన, రెండో భాగం హైలెట్ అవడం, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

సంగీతం, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీత.

బాటమ్ లైన్:

డైరెక్టర్ సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎంతో ఆసక్తి ప్రేక్షకులలో కలుగుతుంది.ఇలా కొత్త కాన్సెప్ట్ ద్వారా డైరెక్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యారని చెప్పాలి.

రేటింగ్ 3/5

తాజా వార్తలు